Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ రద్దు? పోలీసుల షాకింగ్ డెసిషన్..
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:29 PM
పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు షాకివ్వబోతున్నారా? అంటే అవుననే సమాచారమే అందుతోంది. ఇటీవల సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే ఈ బెయిల్‌పై పోలీసులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో ఒక రోజు రాత్రి జైలులో ఉన్నంతరం అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే అల్లు అర్జున్‌కు వచ్చిన మధ్యంతర బెయిల్‌పై పోలీసులు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు హైకోర్టు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బెయిల్ రద్దు నిమిత్తం పోలీసులు నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా సమాచారం.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పేం లేదని, పోలీసులే ఫెయిల్ అయ్యారంటూ ఓ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో.. అసలు సంధ్య థియేటర్ విజిట్‌కు వెళ్లేందుకు అల్లు అర్జున్ అండ్ టీమ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదనేలా ఓ రిపోర్ట్ సోమవారం బయటికి వచ్చిన నేపథ్యంలో.. ఇదే రిపోర్ట్‌తో ఇప్పుడు పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించి, అల్లు అర్జున్‌కి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read- Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..
జరిగింది ఇదే..
తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంట్లో వాలిపోయింది.