R Narayana Murthy: పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి స్వల్ప అస్వస్థత

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:27 PM

పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్ బీరప్ప నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యనిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదని, సాధారణమైన టెస్ట్‌లు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

R Narayanamurthy and Dr Beerappa

పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (People Star R Narayanamurthy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్ బీరప్ప నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యనిమిత్తమై భయపడాల్సిన అవసరం లేదని, సాధారణమైన టెస్ట్‌లు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

Also Read- Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

అసలు విషయం ఏమిటంటే.. ఎప్పుడూ ఏదో ఒక సినిమా పని మీద బిజీబిజీగా తిరిగే నారాయణ మూర్తి.. ప్రసాద్ ల్యాబ్‌ (Prasad Lab)లో తరుచూ కనిపిస్తుంటారు. అలాగే ప్రసాద్ ల్యాబ్ వద్ద ఉన్న ఆయనకు సడెన్‌గా నీరసం రావడంతో.. వెంటనే అక్కడి నుంచి నిమ్స్‌ (Nims) హాస్పటల్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. రెండు నెలల క్రితం ఆర్. నారాయణమూర్తి బైపాస్ చేయించుకుని ఉండటంతో.. డాక్టర్స్ ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కొన్ని జనరల్ టెస్ట్‌లు చేస్తున్నామని డాక్టర్ బీరప్ప తెలిపారు.


ఆర్. నారాయణమూర్తి విషయానికి వస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన ప్రజలలో చైతన్యం కలిగించే సినిమాలనే చేస్తూ ఉంటారు. అందుకే ఆయనను అందరూ పీపుల్ స్టార్‌గా పిలుచుకుంటారు. ఇటీవల ఆయన నటించి నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’ (University)లో ప్రస్తుతమున్న ఓ బర్నింగ్ టాపిక్‌ పేపర్ లీకేజ్‌‌పై ధ్వజమెత్తారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్, వారి తల్లిదండ్రుల ఆశలు, కోరికలు ఎలా నేలరాలిపోతున్నాయో.. ఎంతో విపులంగా ప్రేక్షకలోకానికి తెలియజేశారు. కాగా, ఆర్. నారాయణమూర్తికి స్వల్ప అస్వస్థత అని తెలియగానే ఆయన త్వరగా రికవర్ అవ్వాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

స్పందించిన.. నారాయణ మూర్తి

ఇదిలా ఉండ‌గా త‌న అనారోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో న‌టుడు ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా.. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నానని దేవుడి దయతో బాగానే కోలుకుంటున్నా అన్నారు. పూర్తిగా కోలుకున్నాక అన్ని వివరాలు చెబుతానని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 17 , 2024 | 06:51 PM