CMRF: ‘జెట్టి’ హీరోకి పవన్ కళ్యాణ్ అభినందనలు
ABN, Publish Date - Sep 14 , 2024 | 06:45 PM
వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేనిని, ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ సేవలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. దీనిపై హీరో కృష్ణ మానినేని రియాక్షన్ ఏంటంటే..
వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని (Krishna Manineni)ని, ‘100 డ్రీమ్స్’ (100 Dreams) ఫౌండేషన్ సేవలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ప్రశంసించారు. మొదటి సినిమా ‘జెట్టి’ (Jetty)తో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ మానినేని.. ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరిట గత 8 సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు నిరాశ్రయులైన ఎంతోమందికి ఈ పౌండేషన్ ద్వారా సహాయం అందించారు.
Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..
ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన ఘటనలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణ మానినేని అండ్ టీం.. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలను అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన స్వయంగా 100 డ్రీమ్స్ ఫౌండర్‌ని ఆహ్వానించి అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు ఆయనను కలవడానికి వెళ్లిన హీరో కృష్ణ మానినేని, వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని కలిసిన హీరో కృష్ణ మానినేని మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆత్మీయంగా పలకరించిన తీరు చాలా సంతోషాన్ని కలిగించింది. ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలని ఆయన శ్రద్ధగా విని, మా ప్రయత్నాలను ప్రశంసించి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలని ఆశీర్వదించారు. ఇంత బిజీ సమయంలో కూడా మమ్మల్ని పిలిచి అభినందించిన ఆయనకు జీవితాంతం రుణపడిఉంటాం’’ అని తెలిపారు.
Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?
Read Latest Cinema News