Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ్ మరో సంచలన ప్రకటన

ABN , Publish Date - Aug 25 , 2024 | 09:07 PM

గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగార్జున ఎన్ కన్వెన్షన్ గురించే చర్చ.. రచ్చ! హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి వినిపిస్తున్న పుకార్లను నమ్మవద్దంటూ నాగ్ ఓ సంచలన ప్రకటన చేశారు.

King Nagarjuna N Convention

గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగార్జున ఎన్ కన్వెన్షన్ (N Convention) గురించే చర్చ.. రచ్చ! హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను (HYDRAA) ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఎన్‌ కన్వెన్షన్‌ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. శనివారం ఉదయాన్నే హైడ్రా టీమ్ కూల్చివేతలు ప్రారంభించగా.. దాదాపు అంతా అయిపోయే సమయానికి రాష్ట్ర హైకోర్టు నుంచి నాగార్జున ‘స్టే’ ఆర్డర్ తెచ్చారు. దీంతో నాగ్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయ్యింది. అయితే.. ఎన్ కన్వెన్షన్‌పై కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేక కథనాలు మాత్రం ఆగలేదు.

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

అసలేంటీ ఎన్ కన్వెన్షన్..? పుట్టు పూర్వోత్తరాలు ఏంటి..? వివాదం ఏంటి..? అక్కినేని వారి ఆక్రమణలు ఇలా చిత్ర విచిత్రాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. హీరో అయ్యుండి విలన్‌గా మారి ఆక్రమణలు చేయడమేంటి..? అని నెట్టింట్లో పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియా సంగతి సరేసరి.. ఎవరికి తోచినట్లు వాళ్లు రాసేస్తుండటంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి తాజాగా నాగార్జున ట్విట్టర్ వేదికగా మరోసారి కీలక ప్రకటన చేశారు. అక్కినేని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తూ నాగ్ పలు ఆసక్తికర విషయాలను రాసుకొచ్చారు. (Nagarjuna Tweet)


N-Convention-Hall.jpg

‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,

N-కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను..

మీ,

అక్కినేని నాగార్జున’’ అని నాగార్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 25 , 2024 | 09:18 PM