Om Shivam: యూనివర్శల్‌ సబ్జెక్టుతో ‘ఓం శివం’

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:38 AM

యధార్థ సంఘటనతో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా యూనివర్శల్‌ సబ్జెక్టుగా ‘ఓం శివం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ఆల్విన్ వెల్లడించారు. దీపా ఫిలిమ్స్‌ బ్యానరుపై కేఎన్‌ కృష్ణ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.

om

యధార్థ సంఘటనతో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా యూనివర్శల్‌ సబ్జెక్టుగా ‘ఓం శివం’ (Om Shivam)చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ఆల్విన్ (Alwin) వెల్లడించారు. దీపా ఫిలిమ్స్‌ బ్యానరుపై కేఎన్‌ కృష్ణ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతోభార్గవ్ (Bhargav Krishna) హీరోగా పరిచయమవుతుండగా, శాండల్‌వుడ్‌ హీరోయిన్‌ విరానిక షెట్టీ (Viranika Shetty) ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.. ఇతర పాత్రల్లో లక్ష్మి సిద్ధయ్య, అపూర్వశ్రీ, పాల్‌రాజ్‌, ఉగ్రం రవి, వరదన్‌, రోబో గణేష్‌ నటించారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, ‘ఒక యధార్థ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఈ రొమాంటిక్‌ జానర్‌లో నేటి యువత ప్రేమ కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధపడుతుంటారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు శివుడు. శివుడు ఎంతో యాక్టివ్‌, అగ్రెసివ్‌గా ఉంటారు. అన్ని భాషలకు సరిపోయేలా ఈ టైటిల్‌ ఖరారు చేశాం.

మాండ్య, మైసూర్‌, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో 45 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసి, ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపట్టాం. ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల చేయనున్నాం. ఈ యేడాదిలోగా సినిమా విడుదల చేయాలన్న సంకల్పంతో ఉన్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:41 AM