మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Niharika Konidela: ఆరోజు రాడిస‌న్ బ్లూ ప‌బ్‌లో ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Mar 16 , 2024 | 03:48 PM

నిహారిక తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తనకు పిల్లలంటే ఇష్టమని.. ఇప్పుడు కాదు కానీ.. సమయం వచ్చినప్పుడు మాత్రం రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చిన నిహారిక.. ఆ మధ్య ఓ పబ్‌లో అరెస్ట్ అయిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

Niharika Konidela

ఈ మధ్య నిహారిక కొణిదెల (Niharika Konidela) బాగా వార్తలలో హైలెట్ అవుతోంది. తన విడాకుల అనంతరం.. తిరిగి మళ్లీ నటించేందుకు సిద్ధమవుతోంది. అలాగే తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ (Pink Elephant Pictures)పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ.. నిర్మాతగానూ బిజీగా ఉంటోంది. అయితే నిహారిక తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తనకు పిల్లలంటే ఇష్టమని.. ఇప్పుడు కాదు కానీ.. సమయం వచ్చినప్పుడు మాత్రం రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చిన నిహారిక.. ఆ మధ్య ఓ పబ్‌లో అరెస్ట్ అయిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

వాస్తవానికి ఇంత వరకు నిహారిక తన పెళ్లి, విడాకుల గురించికానీ, అలాగే ఆ రోజు పబ్‌లో ఎందుకు అరెస్ట్ అయిందనే విషయంపై కానీ మాట్లాడలేదు. మధ్యలో మీడియా ఈ విషయం గురించి అడిగినా కూడా ఆమె మాట దాటవేశారు. కానీ ఇప్పుడు.. ఆరోజు పబ్‌లో ఏం జరిగిందో.. తనను ఎందుకు అరెస్ట్ చేశారో.. నిహారిక వివరంగా చెప్పుకొచ్చారు. (Niharika about Radisson Blu Pub Arrest)


ఆమె మాట్లాడుతూ.. ‘‘రాడిసన్ బ్లూ ప‌బ్ (Radisson Blu Pub) కేసులో న‌న్ను అన్యాయంగా ఇరికించారు. నేను ప‌బ్‌ల‌కు వెళ్లను అని చెప్పను కానీ.. పబ్‌లకు, పార్టీల‌కు చాలా త‌క్కువ‌గా వెళ్తుంటాను. ఆరోజు నేను మా స్కూల్ ఫ్రెండ్స్‌ను క‌లిసేందుకు వెళ్లాను. దాదాపు 6 నెల‌ల త‌ర్వాత మేమంతా కలిసి కబుర్లు చెప్పుకున్నాం. కానీ అక్కడ సౌండ్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అందుకే వెంటనే ఇంటికి వెళ్లిపోదామ‌నుకున్నాం. బిల్లు క‌ట్టేసి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యానికి పోలీసులు వ‌చ్చారు. అందరితో పాటు మ‌మ్మ‌ల్ని కూడా స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. అయితే.. దీనిపై మీడియాలో ఎందుకింత ర‌చ్చ చేశారో నాకసలు అర్థం కాలేదు.. చాలా బాధేసింది. త‌ర్వాత తెలిసింది.. అక్క‌డెవ‌రో డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని.. అందుకే పోలీసులు రైడ్ చేశారని. నేను త‌ప్పుడు ప్ర‌దేశంలో ఉన్నాన‌ని చాలా లేట్‌గా తెలుసుకున్నాను’’ అని నిహారిక చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

====================

*Amitabh Bachchan: ఒకవైపు ఆస్పత్రిలో అంటూ వార్తలు.. బిగ్ బి చూడండి ఏం చేస్తున్నారో..

************************

*Rathnam: ‘డోంట్ వర్రీ రా చిచ్చా’.. మాస్ బీట్ అదిరింది

************************

*Niharika: అది మూర్ఖ‌త్వ‌మే.. మళ్లీ పెళ్లి చేసుకుంటా కానీ..

***************************

Updated Date - Mar 16 , 2024 | 03:52 PM