Star Maa: స్టార్ మా కొత్త ‘బోల్డ్‌’ షో.. ఎప్పటి నుంచంటే?

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:05 PM

టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు, ఇత‌ర పోటీ ఛాన‌ళ్ల‌ను మించి ఆక‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాల ప్రొగ్రాముల‌ను తీసుకువ‌స్తున్నారు. ఈక్ర‌మంలో స్టార్ మా అలాంటి ఓ కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చింది.

star maa

టీవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు, ఇత‌ర పోటీ ఛాన‌ళ్ల‌ను మించి ఆక‌ట్టుకునేందుకు ర‌క‌ర‌కాల ప్రొగ్రాముల‌ను రూపొందిస్తున్నారు. ఈక్ర‌మంలో స్టార్ మా అలాంటి ఓ కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చింది. అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు గొప్ప? అనే క్వశ్చన్ రాగ‌.. మేమంటే మేము గొప్పంటూ అని రెండు టీములు ముందుకొచ్చి పోటీ ప‌డే కాన్సెప్ట్ తో స్టార్ మా ఒక కొత్త షో ప్రారంభిస్తోంది. షో పేరు కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ (Kiraak Boys Khiladi Girls).

ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ (Sekhar master), యాంక‌ర్‌గా, న‌టిగా దూసుకుపోతున్న అనసూయ (AnasuyaBharadwaj) ఈ షో కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనుండ‌గా శ్రీముఖి ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ (Kiraak Boys Khiladi Girls) షోను నడిపించనుంది.

చార్మింగ్ స్టార్స్ ఎందరో ఈ ఫన్నీ షో తో "రొటీన్ ఫార్ములా" ని బ్రేక్ చేయబోతున్నారు. స్టార్ మా లో జూన్ 29 నుంచి రాత్రి 9 గంటలకు ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమవుతుంది. ఒకవైపు గాళ్స్ టీమ్, మరోవైపు బాయ్స్ టీమ్ పోటీలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు.


సరదా సరదాగా జరిగే ఈ సమరంలో ప్రేక్షకులకు కావలసినంత వినోదాల విందు అందబోతోంది. ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ (Kiraak Boys Khiladi Girls) గేమ్మ్‌లో ఆట పాటలతో పాటు ఊహించని రౌండ్స్, చిత్ర విచిత్రమైన టాస్కులు, అలరించే ఛాలెంజ్ లు అన్నీ కలిసి షో ని అద్భుతంగా అందించ బోతున్నాయి.

బేసిక్ పోటీ అమ్మాయిలూ.. అబ్బాయిల మధ్యే అయినా.. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. ఈ ప్రేక్షకులకు మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇవ్వ‌డానికి సిద్ధం అవుతోంది.

Updated Date - Jun 25 , 2024 | 04:27 PM