Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?
ABN, Publish Date - Oct 12 , 2024 | 05:37 PM
టాలెంటెండ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాను వివాహమాడబోతున్నారు. నారా రోహిత్, సిరిల ఎంగేజ్‌మెంట్‌కు వేదిక, వేడుక ఫిక్సయింది. ఈ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
టాలెంటెండ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) హీరోయిన్ సిరిలెల్లా (Siri Lella)ను వివాహమాడబోతున్నారు. నారా రోహిత్, సిరిలెల్లాల నిశ్చితార్థానికి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజమే. నారా రోహిత్, సిరిలెల్లాల నిశ్చితార్థం 13 అక్టోబర్, ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ నిశ్చితార్థానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అండ్ ఫ్యామిలీ అంతా హాజరు కాబోతోందని తెలుస్తోంది. నారా ఫ్యామిలీకి సంబంధించిన వారంతా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతుండటంతో.. ఈ వేడుకకు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.
Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ
నారా రోహిత్ విషయానికి వస్తే.. తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును నారా రోహిత్ పొందారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. తన కంటే తన సినిమాలు మాట్లాడితేనే బాగుంటుందని భావిస్తుంటారు. అందుకే వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయన నుండి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటుందనేలా ప్రేక్షకులలో పేరుని పొందారు. (Nara Rohit Engagement with Siri Lella)
సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన నారా రోహిత్.. ఆ పేరుని మాత్రం ఎప్పుడూ వాడుకోలేదు. తన కష్టాన్ని నమ్ముకునే హీరోగా ఎదిగారు. ప్రస్తుతం నారా రోహిత్ వయసు నాలుగు పదులు దాటడంతో.. నారా ఫ్యామిలీ ఆయనని పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. ‘ప్రతినిధి 2’ సినిమాలో తన సరసన నటించిన ‘సిరి’ విషయం చెప్పి.. పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ‘సిరి’ని ఆయన కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నారనేలా కూడా టాక్ వినబడుతోంది. ఏదయితేనేం.. ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. ఆ అమ్మాయినే రోహిత్ పెళ్లాడుతుండటంతో ఇండస్ట్రీలోని మరో జంట.. కపుల్ కాబోతున్నారంటూ అంతా.. ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నిశ్చితార్థం అనంతరం వారి పెళ్లి ఎప్పుడనేది అఫీషియల్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది.