Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..
ABN, Publish Date - Mar 23 , 2024 | 08:33 PM
ప్రతి కళాకారుడికి సామాజిక బాధ్యత వుంటుంది.. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగి ఇస్తున్నామని ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF)’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవిని ఘనంగా సత్కరించారు.
ప్రతి కళాకారుడికి సామాజిక బాధ్యత వుంటుంది.. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగి ఇస్తున్నామని ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఆహా (Aha), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంయుక్తంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF)’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవిని ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ ప్రజెన్స్ ఈ వేడుకకు గొప్ప వైభవాన్ని జోడించగా.. దర్శకులు బాబీ, హీరో సందీప్ కిషన్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వేడుకలో పాల్గొని వారి దృక్పథాన్ని తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఆహా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రావడం చాలా ఆహ్లాదకరంగా వుంది. ఈ వేడుకలో నాకు చిరు సత్కారం జరగడం కూడా చాలా ఆనందంగా వుంది. నాకు పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చిన ఉదయాన్నే మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చి పుష్ప గుచ్చం ఇచ్చి చాలా ఆనందం పొందిన వ్యక్తి మురళీ మోహన్‌గారు. ఆ రోజు మొదలుకొని ఐదారు రోజులు వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి అభినందించారు, సన్మానించారు, ఆనందపడ్డారు. ఐదారు రోజులు పాటు ఒక సంబరంలా వేడుక జరిగిందనే ఆనందం నాకు వుంది. ప్రతి కళాకారుడికి సామాజిక బాధ్యత వుంటుంది. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగి ఇస్తున్నామని ఆలోచిస్తే.. ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారు. సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పత్రికల్లో చదివినప్పుడు మనసు కలిచివేసింది. సమయానికి రక్తం ఇచ్చినట్లయితే ఒక ప్రాణం నిలబెట్టినవారం అవుతాం కదా అనే ఆలోచనతో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నా అభిమానుల మీద నమ్మకంతోనే అది పెట్టాను. ఈ రోజుకీ నిరంతరంగా అది కొనసాగుతుందంటే కనుక అభిమానులు వలనే సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా వారందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. (South India Film Festival)
రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలలోకి వచ్చిన సమయంలో అదే ఆదరణ ప్రేమ ఉంటుందా? అనే ఆలోచన వుండేది. నా సినిమాలో డైలాగ్ ఒకటివుంది. ‘అదే రక్తం.. అదే పౌరుషం’ అనే డైలాగ్. ఇదే డైలాగ్ నేను తిరిగి సినిమాల్లోకి వచ్చినపుడు ప్రేక్షకులు నాకు చెప్పినట్లునిపించింది. ‘అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, అదే గుండెల్లో మీ చోటు’ అన్నట్టుగా అనిపించింది. 150 సినిమా నుంచి ఈ క్షణం వరకూ అదే ఎనర్జీ పొందుతున్నాను. ప్రేక్షకుల స్పందన, అభిమానమే ఎనలేని ఉత్సాహన్ని ఇస్తున్నాయి. ఓపిక వున్నంత వరకూ, మీరు ఆదరించేవరకూ సినిమాల్లోనే వుంటాను. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ ఆవశ్యకత ఎంతైనా వుంది. యువ ప్రతిభని ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. అలాంటి అవకాశం ఈ వేదిక ఇచ్చింది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్‌ని ప్రజెంట్ చేస్తున్న వారంతా సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆహా వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. (Megastar Chiranjeevi)
ఇవి కూడా చదవండి:
====================
*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..
*******************************
*Manchu Vishnu: చిరుకి పద్మ విభూషణ్, అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్, జై బాలయ్య.. ‘నవతిహి’ విశేషాలివే!
******************************
*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..
************************