Megastar Chiranjeevi: కేరళ సీఎంకు రూ. కోటి చెక్ అందజేసిన చిరంజీవి

ABN, Publish Date - Aug 08 , 2024 | 06:56 PM

టాలీవుడ్ నుంచి వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం నిమిత్తం ఎందరో సెలబ్రిటీలు విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. వారిలో కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారు ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి అందజేశారు.

Chiranjeevi and Kerala CM Pinarayi Vijayan

వారం రోజుల క్రితం కేరళలోని వయనాడ్‌ (Wayanad)లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి సెలబ్రిటీలు ఎందరో అక్కడి ప్రభుత్వానికి విరాళాలను అందజేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ఎందరో సెలబ్రిటీలు విరాళం ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. వారిలో కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ప్రకటించిన విషయం తెలిసిందే. వారు ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ను మెగాస్టార్ చిరంజీవి గురువారం కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Kerala CM Pinarayi Vijayan)కి అందజేశారు. (Wayanad Land Slide Victims)

Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

కేరళ CM రిలీఫ్ ఫండ్‌ (CM Relief Fund)కి చిరు, రామ్ చరణ్‌ కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే కాకుండా.. ఇలా స్వయంగా కేరళ వెళ్లి మరీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతికి చెక్ అందజేయడంతో.. మెగాస్టార్‌పై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రికి చెక్ అందించిన చిరంజీవి.. వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం, సహాయక చర్యలు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్కర సమయంలో కేరళకు అండగా నిలబడాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (CM Pinarayi Vijayan)కు మెగాస్టార్ (Megastar) చెక్ ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వయనాడ్‌ ఘటన సహాయార్దం ఇప్ప‌టి వ‌ర‌కు సినీ ప్రముఖులు ఇచ్చిన విరాళాలు..

మోహన్ లాల్- రూ.3 కోట్లు

ప్రభాస్- రూ. 2 కోట్లు

చిరంజీవి, రామ్ చరణ్- 1 కోటి

సూర్య, జ్యోతిక దంపతులు- రూ.50 లక్షలు

మమ్ముట్టి, దుల్కర్- రూ.40 లక్షలు

కమల్ హాసన్- రూ.25 లక్షలు

అల్లు అర్జున్- 25 లక్షలు

ఫహాద్ ఫాజిల్- రూ.25 లక్షలు

విక్రమ్- రూ.20 లక్షలు

రష్మిక- రూ.10 లక్షలు

సితార ఎంటర్‌టైన్‌మెంట్ వంశీ- రూ. 5 లక్షలు

సంయుక్త మీనన్- నెంబర్ తెలియదు

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 06:57 PM