Megastar Chiranjeevi: ఓ రేంజ్‌లో మొదలైన మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:06 PM

ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకలను మెగా ఫ్యాన్స్ నిర్వహిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను ఏకం చేస్తూ గ్లోబల్ లైవ్ మారథాన్ పేరుతో ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటల రాత్రి 12 గంటల వరకు 12 గంటల పాటు ఈ లైవ్ మారథాన్ కొనసాగనుంది. ఈ గ్లోబల్ లైవ్ మారథాన్‌లో పలువురు సెలబ్రిటీలు, సన్నిహితులు మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకోనున్నారు.

Megastar Chiranjeevi

ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్‌డే వేడుకలను మెగా ఫ్యాన్స్ నిర్వహిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను ఏకం చేస్తూ గ్లోబల్ లైవ్ మారథాన్ (Global Live Marathon) పేరుతో ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటల రాత్రి 12 గంటల వరకు 12 గంటల పాటు ఈ లైవ్ మారథాన్ కొనసాగనుంది. ఈ గ్లోబల్ లైవ్ మారథాన్‌లో పలువురు సెలబ్రిటీలు, సన్నిహితులు మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకోనున్నారు. ఇప్పటికే ఈ మారథాన్ లైవ్‌లో మొదలై పలువురు సెలబ్రిటీలు మెగాస్టార్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. పంచుకుంటున్నారు. (Chiranjeevi Birthday Celebrations)

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను

ఈ లైవ్ మారథాన్ నిమిత్తం న్యూయార్క్ నుండి టోక్యో వరకు, సిడ్నీ నుండి జోహన్నెస్‌బర్గ్ వరకు, అభిమానులు మెగాస్టార్ కోసం ఏకమవుతుండటం విశేషం. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మెగాభిమానుల ప్రేమ, అభిమానాన్ని ఏకం చేసేలా జరుగుతోన్న వేడుక. 100కి పైగా దేశాల నుండి‌ మెగా అభిమానులు అందరూ కలిసి మెగాస్టార్ పట్ల తమ గౌరవాన్ని మరియు అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగాభిమానులతో పాటు, ‘విశ్వంభర’ టీమ్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. (Happy Birthday Megastar Chiranjeevi)


ఇక ఈ లైవ్ మారథాన్‌లో ఎమ్.ఎమ్. కీరవాణి, నటి ఖుష్బూ, సింగర్ సునీత, రాజా రవీంద్ర, చోటా కె నాయుడు, దర్శకుడు వశిష్ఠ, హైపర్ ఆది, ఎస్‌కెఎన్, గీతా మాధురి, సుమ కనకాల, మంగ్లీ వంటి వారెందరో మెగాస్టార్‌తో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగమవుతూ.. మెగాస్టార్ పట్ల తమకున్న ప్రేమను, అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ‘‘చిరంజీవితో కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించాను. అందులో అక్కగా నటించాను. కానీ నాకు చిరంజీవితో డ్యాన్స్ చేయాలని ఉంది. ఆయన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఓ మంచి కుటుంబకథా చిత్రం చేయాలని ఉంది. చిరంజీవిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన ఎన్నో విజయాలను చూశారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన చేసే సాయం ఎవరికీ చెప్పుకోరు. అలాంటి మంచి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నటి ఖుష్బూ. మరో వైపు హైదరాబాద్, శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా మెగాస్టార్ బర్త్‌డే వేడుకలు మొదలయ్యాయి.

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 08:11 PM