Manushullo Devudu Chandranna: ‘మనుషుల్లో దేవుడు చంద్రన్న’ పాట వదిలారు
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:13 PM
విజయవాడ నగరంలో వరద సృష్టించిన విధ్వంసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన నిరుపమాన సేవలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్రబాబు నాయుడు అవిరళ కృషి, అసమాన పట్టుదల చూసి ఒక స్ఫూర్తివంతమైన పాటను రచించానని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఆ పాట వివరాల్లోకి వెళితే..
విజయవాడ నగరంలో వరద సృష్టించిన విధ్వంసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన నిరుపమాన సేవలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్రబాబు నాయుడు అవిరళ కృషి, అసమాన పట్టుదల చూసి ఒక స్ఫూర్తివంతమైన పాటను రచించానని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ‘మనుషుల్లో దేవుడు చంద్రన్న’ (Manushullo Devudu Chandranna) అంటూ సాగే ఈ పాటను మాదాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మాత కె.ఎస్. రామారావు ఆవిష్కరించారు.
Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి, ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత యోధుడు, ప్రజలకోసం పనిచేసే నాయకుడు, విజయవాడ ప్రజల ఇక్కట్లను, కన్నీటి గాధలను స్వయంగా చూసి, వయసును కూడా మర్చిపోయి రాత్రి, పగలు సేవలు అందించారు. ఆ సేవలకు స్పందించిన గుమ్మడి గోపాలకృష్ణ రాసి, గానం చేసి, స్వర పరచిన ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకంగా వుందని అన్నారు.
నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ.. గుమ్మడి గోపాలకృష్ణ స్వరపరిచిన ఈ పాట ఎంతో అర్థవంతంగా, సహజంగా వుంది. చంద్రబాబు నాయుడుగారి వంటి ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్రానికి ఉండటం అదృష్టం. ఆయన సేవలతో విజయవాడ నగరం త్వరగా తేరుకుంది అని చెప్పారు.
గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఎంతో అభిమానం, ఆయన అధికారంలోకి రావాలని ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో పాటలను గానం చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రజలకోసం నిరంతరం శ్రమిస్తూ చేస్తున్న సేవలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘మనుషుల్లో దేవుడు చంద్రన్న’ పాటను రూపొందించానని చెప్పారు.
Also Read- Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్
Also Read-Malaika Arora Father: ఆత్మహత్య చేసుకున్న మలైకా తండ్రి అనిల్ అరోరా..
Read Latest Cinema News