మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

ABN, Publish Date - Mar 09 , 2024 | 06:37 PM

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కానీ వీనుల విందైన గానం ఆలపించడంలోనూ ఆమె సిద్ధహస్తురాలు. అందుకే వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ.. సరి చేస్తూనే.. సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. ఆ బహుముఖ ప్రతిభాశాలి పేరు పేరే డా: నాగ మాధురి. ఈ వర్ధమాన గాయని తాజాగా మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ‌ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Mani Sharma and Dr Naga Madhuri

‘‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కానీ వీనుల విందైన గానం ఆలపించడంలోనూ ఆమె సిద్ధహస్తురాలు. అందుకే వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ.. సరి చేస్తూనే.. సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. ఆ బహుముఖ ప్రతిభాశాలి పేరు పేరే డా: నాగ మాధురి (Dr Naga Madhuri). ఈ వర్ధమాన గాయని (Singer Naga Madhuri) తాజాగా మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ‌ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడిని నిజం చేస్తూ... ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే... చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.... సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. (Shambho Mahadeva Album)


గడిచిన శివరాత్రికే లయబద్ధంగా ఒక త్యాగరాజ కృతిని ఆ లయకారునికి నివేదించుకోవాలని సంకల్పించిన నాగ మాధురి.. ఆ దృశ్య పూర్వక గాన యజ్ఞాన్ని ఈ శివరాత్రికి పూర్తి చేసి, మహా శివుడికి సమర్పించుకున్నారు. దక్షిణ భారత సినీ సంగీతరంగంలో పేరెన్నికగన్న స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో ‘శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ’ త్యాగరాజ కృతిని ఆలపించి... ‘గాన మాధురి’ అనే తన పిలుపును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 వాయిద్యాలలో నిష్ణాతులు కావడంతోపాటు... కర్నాటిక్ సంగీతంలో విద్వాంసులు, స్ట్రింగ్స్ ప్లేయర్ అయిన సుభాని... కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. ఈ కృతిని ప్రముఖ యువ దర్శకుడు విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో వీడియో రూపంలోనూ తీర్చి దిద్దడం, ఆ కృతిని ఆమె ఆలపిస్తుండగా చిత్రీకరించడం ప్రశంసార్హం. ఆది సాయి కుమార్‌తో ‘జోడి’ చిత్రం రూపొందించిన విశ్వనాధ్... ‘పరంపర’ వెబ్ సిరీస్‌తో తన ప్రతిభను చాటుకున్నారు.

‘శంభో మహాదేవ’ ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ (Music Director Mani Sharma) ఆవిష్కరించి, అభినందించడం విశేషం. ‘శంభో మహదేవ’ (Shambho Mahadeva) ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని పేర్కొన్న డాక్టర్ నాగ మాధురి... మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

Updated Date - Mar 09 , 2024 | 06:37 PM