కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

ABN, Publish Date - Jan 04 , 2024 | 05:53 PM

‘చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా.. మనం సైతం’ అంటూ సినిమా ఇండస్ట్రీలోని వారికి ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ ముందుంటున్నారు. దశాబ్దం దాటినా.. నిర్విరామంగా ఆయన ‘మనం సైతం’ ద్వారా సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా దీనస్థితిలో ఉన్న నటి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ ద్వారా రూ. 25,000 చెక్కును అందించారు కాదంబ‌రి కిర‌ణ్.

Kadambari Kiran and Pavala Syamala

‘చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా.. మనం సైతం’ అంటూ సినిమా ఇండస్ట్రీలోని వారికి ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ ముందుంటున్నారు. దశాబ్దం దాటినా.. నిర్విరామంగా ఆయన ‘మనం సైతం’ ద్వారా సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా దీనస్థితిలో ఉన్న నటి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ ద్వారా రూ. 25,000 చెక్కును అందించారు కాదంబ‌రి కిర‌ణ్.

సినీ నటుడు,‘మనం సైతం’ (Manam Saitham) ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ (Kadambari Kiran) మరోసారి దాతృత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌ల‌ (Pavala Syamala)కు ఆర్థిక స‌హాయం అందించి మాన‌వ‌త్వం ప్రదర్శించారు. సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌లకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ఆర్థిక స‌మ‌స్య‌లు తోడ‌య్యాయి. తనను ఆదుకోవాలని ఎందరికో ఆమె విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆమెకు ఇండస్ట్రీ నుండి చాలా మంది సహాయం చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఆమెకు సహాయం అందించారు. అయినా కూడా ఆమె కష్టాలు తీరలేదు. ఆమె అనారోగ్య, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న కాదంబ‌రి కిర‌ణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావ‌ల శ్యామ‌లకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా సాయం చేశారు.


అవసరార్థులను తెలుసుకొని వారి వద్దకే వెళ్లి సాయం చేయడం కాదంబరి కిరణ్ గొప్పతనం. మీడియా ద్వారా పావల శ్యామల గురించి తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామలను తనంతట తానే వెతుక్కుంటూ వెళ్లి స్వయంగా సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు. ఆయ‌న మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా.. ఏ ఆప‌ద వ‌చ్చినా.. మనం సైతం అండగా ఉంటుందని మరోసారి కాదంబరి కిరణ్ చాటి చెప్పారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

************************

*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

*******************************

*Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

*******************************

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

Updated Date - Jan 04 , 2024 | 05:53 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!