Hema-Maa: హేమ విషయంపై ‘మా’ కమిటీలో చర్చ.. సస్పెండ్ చేస్తారా?
ABN, Publish Date - Jun 05 , 2024 | 06:43 PM
ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీలో ‘మా’ సభ్యురాలైన హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు. ఇప్పుడు మా మెంబర్స్‌తో మంచు విష్ణు చర్చలు మొదలెట్టారు.
ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీలో ‘మా’ (Maa) సభ్యురాలైన హేమ (Hema) డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు (Manchu Vishnu) ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు. ఆ తర్వాత బెంగళూర్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పాటు ఇప్పటికే బెంగుళూరు పోలీసుల ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందనేలా చర్చలు మొదలయ్యాయి. ఈ విషయమై తాజాగా ‘మా’ కమిటీ మెంబర్స్ (MAA Members) సమావేశమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
Also Read- Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?
బెంగళూర్ రేవ్ పార్టీ విషయంలో హేమకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెపై ‘మా’ యాక్షన్‌కు సిద్ధమైంది. హేమ విషయమై కమిటీ సభ్యుల అభిప్రాయాలను ‘మా’ అధ్యక్షుడు (Maa President) మంచు విష్ణు కోరగా.. ఆమెను ‘మా’ నుంచి సస్పెండ్ (Suspend) చేయాల్సిందేనని మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు ‘మా’ నుంచి ఆమెను సస్పెండ్ చేసేందుకు ‘మా’ అధ్యక్షుడు విష్ణు సిధ్ధమైనట్లు సమాచారం. ఏ విషయం గురువారం ‘మా’ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది.
అసలేం జరిగిందంటే.. (Bengaluru Rave Party)
బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలతోపాటు నటి హేమ కూడా ఉందని టాక్ రావడంతో అలెర్ట్ అయిన హేమ (Actress Hema) ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేసి హైదరాబాద్‌లోనే ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నానని ప్రకటించింది. అయితే అక్కడున్న వారిలో హేమ కూడా ఉందని మాదక ద్రవ్యాలు సేవించిందని ఆ సాయంత్రానికే పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమెను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరల్ ఫీవర్ అంటూ హేమ విచారణ హాజరు కాకపోవడంతో మరోసారి పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
Read Latest Cinema News