మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yamadheera: విల‌న్‌గా క్రికెట‌ర్ శ్రీశాంత్.. యమధీర టీజర్ లాంచ్

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:58 PM

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. ఈ సినిమా టీజర్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గురువారం లాంచ్ చేశారు.

ashok

కన్నడ హీరో కోమల్ కుమార్ (Komal Kumar) హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర (Yamadheera). శ్రీమందిరం ప్రొడక్షన్స్ (Srimandiram Productions) లో వేదాల శ్రీనివాస్ (Vedala Srinivas) తొలి చిత్రంగా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గురువారం లాంచ్ చేశారు..

ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ (Vedala Srinivas) మాట్లాడుతూ.. ఇది తన మొదటి చిత్రమ‌ని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుందని తెలిపారు.


అనంత‌రం అశోక్ కుమార్ మాట్లాడుతూ...తన స్నేహితుడు వేదాల శ్రీనివాస్ (Vedala Srinivas) కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలు పెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ (Srimandiram Productions) లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు.

కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషమ‌ని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానంలో చూపే దూకుడుని ప్రతి నాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

Updated Date - Mar 14 , 2024 | 09:58 PM