Bigg Boss8: ‘నీకు నోటి దూలా.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా?’.. నాగ్ వార్నింగ్

ABN, Publish Date - Oct 13 , 2024 | 08:13 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రేటింగ్ లేపడానికి నాగ్ కూడా కాస్త అగ్రెసివ్ పదాలు వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకు ముందు సీజన్‌లలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌పై ఆయన మాట్లాడుతున్న తీరు అలా ఉంది. ఇంతకీ నాగార్జున ఏమన్నారంటే..

King Nagarjuna Bigg Boss 8 Episode

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8) రేటింగ్ లేపడానికి నాగ్ కూడా కాస్త అగ్రెసివ్ పదాలు వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకు ముందు సీజన్‌లలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌పై ఆయన మాట్లాడుతున్న తీరు అలా ఉంది. ‘నీకు నోటి దూలా.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా?’ అంటూ నాగ్ (King Nagarjuna) మాట్లాడుతుంటే.. అసలు కింగేనా? ఇలా మాట్లాడుతుంది.. అని టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులే కాకుండా.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆశ్చర్యపోయారంటే.. బిగ్ బాస్ ఈసారి ఏదో కాస్త గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు. ముఖ్యంగా ఈసారి నాగార్జునతో బిగ్ బాస్ గేమ్ ఆడిస్తున్నట్లుగా ఉంది.

Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?

ఎందుకంటే, వారం మొత్తంలో హౌస్‌లో ఎవరెవరు ఏమేం మిస్టేక్స్ చేశారని తెలుపుతూ.. వాళ్లకి క్లాస్ ఇచ్చే నాగార్జున.. ఈ వారం మాత్రం కావాలని గొడవలు పెట్టినట్లుగా రోహిణి, మణికంఠ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఏదో క్యాజువల్‌గా మేము సీనియర్స్‌మి.. మీరు మా ముందు బచ్చాలు అని రోహిణి అన్న మాటని పట్టుకుని.. ‘నీకు నోటి దూలా.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా?’ అంటూ నాగ్ క్లాస్ ఇవ్వడం అందరికీ సిల్లీగా అనిపించింది. అంతేకాదు, అదే మాటని పదే పదే అనడంతో నిజంగానే మణికంఠ ఫీలైపోయి, ఈ వారం అంతా రోహిణి (Rohini)కి చుక్కలు చూపించాలనేది నాగార్జున ఉద్దేశ్యమేమో. అలా కాకుండా, మణికంఠ (Manikanta) ద్వారా ఆమెని నామినేట్ చేయించి బయటికి పంపించే ప్లాన్ ఏమైనా జరుగుతుందేమో.. ఏమో ఆ బిగ్ బాస్‌కి, నాగార్జునకే తెలియాలి. అలాగే విష్ణు ప్రియ (Vishnu Priya) ఎపిసోడ్‌లోనూ నాగార్జున తీరు అలాగే అనిపించింది. కావాలని ఆమెతో వాగించడానికి నాగ్ ప్రయత్నిస్తున్నాడేమో అని అనిపించింది. హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్.. ఇలా అందరికీ ఈ వారం నాగ్ క్లాస్ ఇచ్చారు.


ఇక ఈ వారం ఎలిమినేషన్‌ లిస్ట్‌లో ఆరుగురు ఉండగా.. మెహబూబ్, సీత మినహా అంతా సేఫ్ అయ్యారు. వీరిద్దరినీ టెన్షన్ పెట్టి.. చివరికి సీతని ఎలిమినేట్ చేశారు. మెగా ఛీప్ పొజిషన్‌లో ఉన్న వారి విషయంలో కూడా చివరి వరకు ఇంత టెన్షన్ పెట్టడం కాస్త ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అయినా, అతన్ని సేఫ్ చేసి.. ఓట్లు రాలేదనే కారణంతో సీతని ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆమె ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రికి ప్రసారం కానుంది. అలాగే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున రైజింగ్ స్టార్స్ అంటూ స్టార్స్ ఇవ్వడం, అందుకు కారణాలు చెప్పడం వంటివి కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2024 | 08:13 AM