మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaliyugam Pattanamlo: మార్చి 22న థియేట‌ర్ల‌లోకి.. ‘కలియుగం పట్టణంలో’

ABN, Publish Date - Feb 19 , 2024 | 02:19 PM

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వ‌ర‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Kaliyugam Pattanamlo

టాలీవుడ్‌లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Aayushi Patell) హీరోహీరోయిన్లుగా, చిత్రా శుక్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo) అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది.

ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి (Ramakhanth Reddy) నిర్వ‌హిస్తుండ‌గా కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (Chandra Obul Reddy Kandula), జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ఇదివరకు రాన‌టువంటి కాన్సెప్ట్‌తో, సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొదించారు.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. కడప జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు. 45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశామని, అందుకు సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పారు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేయ‌గా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

Updated Date - Feb 19 , 2024 | 02:19 PM