Kajal Aggarwal: దుబాయ్ కియారా లాంచ్‌లో కాజల్ సందడి.. క్రేజ్ అంటే ఇది
ABN, Publish Date - Oct 31 , 2024 | 11:35 AM
కాజల్ అగర్వాల్ పెళ్లయిపోయింది. ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇక ఆమె పని అయిపోయిందిలే అని అనుకునే వారికి.. రీ ఎంట్రీతో కాజల్ షాకిచ్చింది. రీ ఎంట్రీలో మంచి స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ కాజల్ దూసుకెళుతోంది. ఇంకా ఆమె క్రేజ్ గురించి తెలియాలంటే తాజాగా దుబాయ్‌లో జరిగిన కియారా బొటిక్ లాంచ్ ఈవెంట్ చూస్తే సరి.
కాజల్ అగర్వాల్ పెళ్లయిపోయింది. ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇక ఆమె పని అయిపోయిందిలే అని అనుకునే వారికి.. రీ ఎంట్రీతో కాజల్ షాకిచ్చింది. రీ ఎంట్రీలో మంచి స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ కాజల్ దూసుకెళుతోంది. ఇంకా ఆమె క్రేజ్ గురించి తెలియాలంటే తాజాగా దుబాయ్‌లో జరిగిన కియారా బొటిక్ లాంచ్ ఈవెంట్ చూస్తే సరి. కియారా జ్యువెలరీ వారు దుబాయ్‌లో సరికొత్త బొటిక్‌ని లాంచ్ చేశారు. ఈ బొటిక్‌ని లాంచ్ చేసేందుకు కాజల్ అగర్వాల్ హాజరైంది. ఆమెను చూసేందుకు జనం ఎగబడటంతో.. కాజల్ క్రేజ్ ఇదంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read-Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఎవరంటే.. లుక్ వచ్చేసింది
కియారా జ్యువెలరీ దుబాయ్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన బొటిక్ ప్రారంభోత్సవానికి కాజల్ హాజరవడంతో.. తమ బ్రాండ్ వేల్యూ పెరిగిందని నిర్వాహకులు సైతం చెప్పడం విశేషం. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాజల్ రాకతో ఇక్కడి వాతావరణమే మారిపోయింది. ఆమె చేతుల మీదుగా ఈ బొటిక్ లాంచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ప్రజెన్స్‌తో ఇండియన్ కస్టమర్లలో తమ బొటీక్ మరింతగా రీచ్ అందుకుంటుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read-KA Review: కిరణ్ అబ్బవరం కొత్త ప్రయత్నం 'క' ఎలా ఉందంటే
ఈ సందర్భంగా కియారా జ్యువెలరీ క్రియేటివ్ ఫోర్స్ సోనాల్ పాండే మాట్లాడుతూ.. మా బొటిక్ ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ గారికి ధన్యవాదాలు. కియారాలో, ఆభరణాలు ఒక అనుబంధం కంటే ఎక్కువ అని మేము నమ్ముతున్నాము. ఇది ప్రతి మహిళలోని వ్యక్తిత్వానికి మరియు అందానికి సంబంధించిన వేడుక. నాణ్యత లేదా స్టైల్ విషయంలో రాజీ పడకుండా చక్కటి ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ కొత్త బొటిక్‌తో అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన, ప్రతి ఒక్కరికీ ఆసక్తి పెంచే అనుభవాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము మా కస్టమర్ల విశ్వాసం మరియు విధేయతకు విలువనిస్తూ.. వారి అభిరుచులు మరియు కోరికలను తీర్చాలనే ధ్యేయంగా ఉన్నాము. అందుకు ఈ బొటిక్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నామని తెలిపారు.