Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:52 PM

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ ఇదే..

Jani Master

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడని, లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లుగా పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?


జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు:

- జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పేర్కొన్న నార్సింగి పోలీసులు.

- జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు.

- 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయమైనట్లు కోర్టుకు తెలిపిన పోలీసులు.

- దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు పేర్కొన్న పోలీసులు.

- ముంబైలో ఓ హోటల్‌లో బాధితురాలిపై 2020లో జానీమాస్టర్ లైంగిక దాడి

- తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయస్సు 16 ఏళ్లు

- గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు

- విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు

- తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలకు సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు: పోలీసులు.

- జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు.

-జానీ మాస్టర్ బాధితురాలిని పెళ్లి చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు

-బాధితురాలు ఇంటికి జానీ మాస్టర్, అతని భార్య వెళ్లి పలుమార్లు చెప్పుతో కొట్టారు

-షూటింగ్ సమయంలో కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తూ.. ఇబ్బంది పెట్టాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 05:22 PM