Jani Master: డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై జానీ మాస్టర్ సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Dec 09 , 2024 | 05:21 PM

ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటికి వచ్చారు జానీ మాస్టర్. అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్న డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో తనకు తెలియకుండానే ఎన్నికలు నిర్వహించడంతో.. జానీ మాస్టర్‌పై అనేకానేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు బ్రేక్ వేస్తూ.. జానీ మాస్టర్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే..

Jani Master

తనని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుండి తొలగించినట్లుగా వస్తున్న వార్తలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివరణ ఇచ్చారు. ఆ వార్తలలో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే సోమవారం ఉదయం నుండి జానీ మాస్టర్‌ సంబంధించి వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌‌కు జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఉండగా.. జానీ మాస్టర్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం ఈ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. తను అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు తనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించడంపై జానీ మాస్టర్ చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఈ వీడియోలో జానీ మాస్టర్ తెలిపారు. ఇంకా ఈ వీడియోలో జానీ మాస్టర్ మాట్లాడుతూ..

Also Read- Suriya: ‘కంగువా’ నిర్మాతకు భారీ నష్టం.. సూర్య ఏం చేస్తున్నారంటే?


‘‘మార్నింగ్ నుండి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతున్నారు. ఈ సందర్భంగా నాకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజమైన న్యూస్ ఏంటో తెలుసుకుని ప్రచారం చేయండి.. లేనిపోని రాతలు రాస్తే దానివల్ల ఎంతోమంది బాధపడతారు. నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు రాశారు. అందులో నిజం లేదు.


టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. ఇండస్ట్రీలో నేను ఏ యూనియన్‌లో అయినా పనిచేయవచ్చు. నేను చాలా మంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్‌కి అవకాశం ఇచ్చాను. అందులో ఈ రోజు చాలా మంది కొరియోగ్రాఫర్స్‌గా చేస్తున్నారు. త్వరలో ఇంకొందరు వస్తారు. ఏదిఏమైనా నాకు గుర్తింపునిచ్చింది మాత్రం ఈ యూనియనే. నేను ఈ రోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఉన్నానంటే ఈ యూనియనే కారణం. కాబట్టి యూనియన్ అంటే నాకెప్పుడు గౌరవం ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్‌పై నేను తీసుకునే చర్యలు తొందరలోనే చెబుతున్నారు. అంతవరకు ఎలాంటి వార్తలు రాయవద్దు. సపోర్ట్‌గా నిలిచిన అందరికీ మరొక్కసారి థ్యాంక్యూ. ‘గేమ్ చేంజర్’ మూవీలో నా కొరియోగ్రఫీలో చేసిన ఓ మంచి పాట త్వరలోనే రాబోతుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

Also Read-Manchu Manoj: హాస్పిటల్‌కు మంచు మనోజ్.. కాళ్లకు బలమైన గాయాలు

Also Read-Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2024 | 05:22 PM