Ilaiyaraaja Music Concert: జూలై 14న ఇళయరాజా సంగీత విభావరి.. టిక్కెట్ ధర ఎంతంటే?
ABN, Publish Date - May 19 , 2024 | 02:17 PM
ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీత విభావరి జూలై 14వ తేదీ ఆదివారం నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సంగీత కచ్చేరికి సంబంధించి పోస్టర్, టిక్కెట్‌ను తాజాగా విడుదల చేశారు. మెర్క్యురీ, అరుణ్ ఈవెంట్స్ సంస్థలు కలిసి ఈ లైవ్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్నాయి.
ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీత విభావరి (Ilaiyaraaja Music Concert) జూలై 14వ తేదీ ఆదివారం నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సంగీత కచ్చేరికి సంబంధించి పోస్టర్, టిక్కెట్‌ను తాజాగా విడుదల చేశారు. మెర్క్యురీ, అరుణ్ ఈవెంట్స్ సంస్థలు కలిసి ఈ లైవ్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్నాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సంగీత విభావరి కార్యక్రమాలను మించే రీతిలో గట్టి భద్రత, సకల సౌకర్యాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. (Ilaiyaraaja Music Concert)
*Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!
ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్వాహకుల్లో ఒకరైన అరుణ్ (Arun) మీడియాతో మాట్లాడుతూ, ‘తమిళ సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజాతో కలిసి ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా సగర్వంగా వెల్లడిస్తున్నాం. ఈ సంగీత విభావరికి సంబంధించిన పోస్టర్లు, టిక్కెట్లను రిలీజ్ చేస్తున్నాం. సుమారుగా 50 వేల మంది పాల్గొంటారని భావిస్తున్నాం. గతంలో జరిగిన మ్యూజికల్ నైట్ కార్యక్రమాల సందర్భంగా ఏర్పడిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గట్టి భద్రతా ఏర్పాట్లు చేశాం. ప్రేక్షకులు వచ్చివెళ్ళేందుకు వీలుగా మెట్రో రైల్, ర్యాపిడో, అద్దెకార్లు సర్వీసులతో అవగాహన కుదుర్చుకుని, ఈ సర్వీసులు కచ్చేరి ముగిసేంత వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. టిక్కెట్లను పేటీఎం తదితర యాప్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. కనీస టిక్కెట్ ధర రూ.వెయ్యి, గరిష్ట ధర రూ.25 వేలు అని వివరించారు.
Read Latest Cinema News