40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RAM : గేమ్ చేంజర్ సినిమాలో.. రామ్‌చ‌ర‌ణ్‌తో నటించా

ABN, Publish Date - Jan 25 , 2024 | 02:59 PM

సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంట‌గా న‌టించిన చిత్రం ‘రామ్ RAM (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ’ జనవరి 26న సినిమా రిలీజ్‌ సందర్భంగా హీరో పంచుకున్న విశేషాలివే..

RAM

దేశ భక్తిని చాటే ‘రామ్ RAM (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ’ చిత్రం ఈ రిప్లబిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల (Surya Ayyalasomayajulaఝ) హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజ్‌ సందర్భంగా హీరో సూర్య అయ్యలసోమయాజుల పంచుకున్న విశేషాలివే..

చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. తేజ తీసిన కేక చిత్రంలో నటించాను. ఆ తరువాత కుటుంబ సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. మళ్లీ ఇప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. కరోనా టైంలోనే మూవీస్ కోసం ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. అలా గేమ్ చేంజర్ సినిమాలోనూ అవకాశం రావడంతో నటించాను.

కేక మూవీ సినిమాకు మిహిరాం అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ పరిచయంతోనే ఈ కథ నా వద్దకు వచ్చింది. మిహిరాంతో నాది పది, పదిహేనేళ్ల అనుబంధం. మిహిరాం కూడా తన కథలు పట్టుకుని ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతుండేవారు. అలా మా ఇద్దరి జర్నీ ఈ రామ్ సినిమాతో ప్రారంభం అయింది.

రామ్ సినిమాకు ఆర్థిక కష్టాలు వచ్చాయి. ముందు వేరే నిర్మాత ఉండేవారు. కానీ ఆ తరువాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సాయం చేయడంతో క్రౌడ్ ఫండింగ్‌లా సినిమాను పూర్తి చేశాం. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారంతోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాను.

కో-డైరెక్టర్ సాయంతో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. రామ్ చరణ్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది.


రామ్ చిత్రంలో సీనియర్ నటులు చాలా మంది పని చేశారు. సాయి కుమార్ గారు, భాను చందర్ గారు, శుభలేఖ సుధాకర్ గారు నటించారు. వారు ఇప్పటికీ ఎంతో కష్టపడుతూ, క్రమశిక్షణతో సెట్స్ మీద నటిస్తుంటారు. వారితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. వారి దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని, హీరోయిన్ ధన్యా బాలకృష్ణ ఎంతో సపోర్ట్‌గా నిలిచింద‌న్నారు.

చిన్నతనం నుంచి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల మీద ఇంట్రెస్ట్. ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండేవాడ్ని. అందుకే ఈ సినిమాలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయగలిగాను. ఎక్కడా కూడా డూప్‌ను వాడలేదు. అన్నీ సొంతంగానే చేశాను. ఫైట్స్ సీక్వెన్స్ చేసిన టైంలో ఎన్నో గాయాలయ్యాయ‌న్నారు.

రామ్ చిత్రం ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా, మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుందన్నారు. సోషల్ మెసెజ్ ఇస్తూనే కమర్షియల్ ఫార్మాట్‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రామ్ చిత్రాన్ని తెరకెక్కించామ‌ని మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ ఆడియెన్స్‌కు త‌ప్ప‌క‌ వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు వేసిన ప్రీమియర్స్‌లో సెకండాఫ్‌ చూసి మహిళలు కంటతడి పెట్టారని పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 02:59 PM