Jani Master: జానీ మాస్టర్ మదర్‌కు గుండెపోటు
ABN, Publish Date - Oct 12 , 2024 | 10:21 PM
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మదర్ బీబ్జాన్ తీవ్ర గుండెపోటుకు గురైనట్లుగా తెలుస్తోంది. శనివారం ఆమెకు తీవ్ర గుండెనొప్పి రావడంతో.. వెంటనే బంధువులు నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ నెలకొంది. అదేంటంటే..
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) మదర్ బీబ్జాన్ తీవ్ర గుండెపోటుకు గురైనట్లుగా తెలుస్తోంది. శనివారం ఆమెకు తీవ్ర గుండెనొప్పి రావడంతో.. వెంటనే బంధువులు నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి వివరాలు తెలియలేదు. గత కొన్ని రోజులుగా తన కుమారుడు జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలు, కేసు, విచారణ వంటి వాటితో బీబ్జాన్ బాగా భయాందోళనలకు గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీబ్జాన్ పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Also Read- Nara Family Marriage: నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం ఎప్పుడు, ఎక్కడంటే?
మరోవైపు జానీ మాస్టర్ కోసం ఆయన భార్య సుమలత పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా జానీ మాస్టర్ కేసు మరో ట్విస్ట్ తీసుకుంది. ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా చెప్పబడుతుందో.. ఆమె తనపై లైంగిక దాడి చేసిందంటూ ఓ యువకుడు ఆమెపై కేసు పెట్టారు. జానీ మాస్టర్ అల్లుడైన షమీర్, తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని, అప్పుడు తాను మైనర్‌నని చెబుతూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయబోతున్నట్లుగా సమాచారం.