Hansika: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయ్

ABN, Publish Date - Dec 05 , 2024 | 08:57 AM

కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.. అమెరికాలో తెలుగువారి సత్తా చాటారు. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి దాదాపు 118 మంది పోటీ పడ్డ నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Hansika Nasanally

తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు అచ్చమైన తెలుగమ్మాయ్ హన్సిక నసనల్లి. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచి అమెరికా తెలుగు వైభవాన్ని చాటారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి దాదాపు 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో తెలుగమ్మాయ్ హన్సిక నసనల్లి నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్‌గా నిలిచి కిరీటం అందుకున్నారు.

Also Read- SoChay Wedding: ఘనంగా నాగ చైతన్య, శోభితల వివాహం.. కింగ్ నాగ్ స్పందనిదే..


ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా ఆమె సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్న హన్సిక ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ ఇప్పటికి నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ. మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు.


హన్సిక నసనల్లి స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

Also Read-Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు

Also Read-SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2024 | 08:58 AM