మంగ మీడియా మెలోడీస్ ‘పూల కొమ్మలు’ ముఖచిత్రంపై రాజమౌళి
ABN, Publish Date - Jul 02 , 2024 | 01:21 AM
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
భారతీయ చలన చిత్రాలకూ, కళలకూ, పోరాటాలకూ, రాజకీయాలకు, తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ, సాహిత్యానికీ, కవిత్వానికీ, ఉద్యమాలకూ సంబంధించిన జ్ఞాన, విజ్ఞాన నిలయాలుగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయా రంగాలలో ప్రామాణికమైన ప్రతిభ ఉన్న సుమారు రెండు వందల మంది విశేష వైభవాలతో ‘పూల కొమ్మలు’ పేరిట ఒక ప్రత్యేక సంచిక తెలుగు వాకిళ్ళలో పరిమళించబోతోంది.
ముప్పవరపు వెంకయ్య నాయుడు, జస్టిస్ రమణ, నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్, బండారు దత్తాత్రేయ, బండి సంజయ్, కొణిదెల పవన్ కళ్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్, కె. విజయేంద్రప్రసాద్, ఎస్.ఎస్.రాజమౌళి, కొణిదెల చిరంజీవి, ప్రభాస్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, బి.సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, జె. నాగ్ అశ్విన్, కె. రాఘవేంద్ర రావు, వంశీ, కృష్ణవంశీ, ఎ.కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీను,మోహన్ బాబు, శేఖర్ కమ్ముల, అశ్వనీదత్, దిల్ రాజు, శోభు యార్లగడ్డ, డి .వి. వి. దానయ్య, మాగంటి మురళీమోహన్, కోట శ్రీనివాస రావు, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి, శృంగేరి భారతీతీర్ర్ద స్వామి, చాగంటి కోటేశ్వరరావు, చిన్న జీయరుస్వామి, సిద్ధేశ్వరానంద స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, విశాఖ స్వరూపానంద స్వామి,
గరికపాటి నరసింహారావు, కుప్పా విశ్వనాధ శాస్త్రి, సామవేదం షణ్ముఖ శర్మ, ఆకెళ్ళ విభీషణ శర్మ, సన్నిధానం నరసింహశర్మ, జయధీర్ తిరుమలరావు, మాడుగుల నాగఫణిశర్మ, బేతవోలు రామబ్రహ్మం, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, తనికెళ్ళ భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, నగ్నముని, శివారెడ్డి, ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్, డాక్టర్ కర్రి రామారెడ్డి, శాంత బయోటెక్ వరప్రసాదరెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, శలాక రఘునాధ శర్మ, డాక్టర్ ఎన్.గోపి, వాడ్రేవు చిన వీరభద్రుడు, యాకూబ్, పతంజలి శాస్త్రి, రమణ దీక్షితులు, ఎం. నాగేశ్వర రావు, కె.శ్రీనివాస్, శక్తి , మహమ్మద్ ఖదీర్ బాబు, రామజోగయ్య శాస్త్రి, బుర్రా సాయిమాధవ్, పురాణపండ శ్రీనివాస్, పి. సుశీల, ఎస్.పి. శైలజ, పి.వి సింధు, సింగర్ సునీత, సింగర్ స్మిత, యాంకర్ సుమ, యాంకర్ ఉదయభాను, శ్రీమతి ఇందిరాదత్, డాక్టర్ గురవారెడ్డి, సింగర్ శ్రీరామచంద్ర, సింగర్ హేమచంద్ర వంటి సుమారు రెండు వందలమంది వివిధ రంగాల ప్రముఖులతో ఈ బుక్ ఆల్బమ్ తెలుగునాట తొలిసారిగా ప్రచురించడం విశేషం. ఇంకా అనేక రంగాల ప్రముఖులు కూడా ఇందులో చోటుచేసుకుంటున్నారని ఎమ్. ఎమ్.ఎమ్. సంస్థ ప్రకటించింది.
2024 విజయదశమికి విడుదల కానున్న ఈ విశేష ప్రత్యేక సంచికను విజయవాడకు చెందిన మంగ మీడియా మెలోడీస్ సంస్థ ‘పూల కొమ్మలు’ పేరిట ముద్రిస్తోంది.