Uday Tiruchunapalli: గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమా బడ్జెట్‌ను తగ్గించవచ్చు..

ABN, Publish Date - Aug 15 , 2024 | 02:02 PM

‘గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే.. అబ్బో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే’ అంటున్నారు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి. గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్‌ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’తో అలవోకగా అద్భుతాలు చేయవచ్చిన ఆయన చెబుతున్నారు.

Graphics and Visual Effects Expert Uday Tiruchunapalli with Kona Venkat

‘గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (Graphics - Visual Effects) అనగానే.. అబ్బో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే’ అంటున్నారు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి (Uday Tiruchunapalli). గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్‌ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (Artificial Intelligence)తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఆయన ఘంటాపధంగా చెబుతున్నారు.

Also Read- Mr Bachchan Review: ర‌వితేజ.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఎలా ఉందంటే?

కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పట్టాపొందిన ఉదయ్ తిరుచినాపల్లి... అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశారు. అయితే చిన్నప్పటి నుంచి సినిమా అంటూ పాషన్, పిచ్చి ఉన్న ఉదయ్... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే... ‘అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్’ (Advance Visual Effects)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. జాబ్ చేస్తూనే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌కి పని చేస్తూ.. తన స్కిల్స్‌కి పదును పెట్టుకున్న ఉదయ్... కొన్నేళ్ల క్రితం, ఉద్యోగానికి స్వస్తి చెప్పి... సినిమాలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం మొదలెట్టారు.


పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి, తన ఉనికిని, ప్రతిభను చాటుకున్న ఉదయ్ (Uday)... ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఎ మండే’ (HOW IS THAT FOR A MONDAY) అనే ఆంగ్ల చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్‌గా పని చేశారు. ఈ చిత్రం ‘ఈటివి విన్’లోనూ ప్రసారమవుతుండడం విశేషం. అలాగే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుని ‘జీ-5’లో ప్రసారమవుతున్న ‘8 ఎ.ఎమ్.మెట్రో’కు కూడా గ్రాఫిక్స్ అందించారు. ఈ చిత్రాన్ని ‘మల్లేశం’ ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించారు. ‘సాచి’ చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సొబగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి... సెన్సేషనల్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ ‘గీతాంజలి - మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachhindi) చిత్రానికి పని చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నారు. ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి, తనకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన కోన వెంకట్‌కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని ఆయన తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Aug 15 , 2024 | 02:02 PM