Tollywood: సినిమా సహాయకులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:01 AM

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా ప్రమోట్ చేయబడిన మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్, ఎంటర్‌టైన్మెంట్ పరిశ్రమలోని వివిధ కార్యకలాపాలను స్ట్రీమ్ లైన్ చేయడంలో పాలుపంచుకున్న ప్రొడ్యూసర్ బజార్‌తో చేతులు కలిపింది. ఇది సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్లకు శిక్షణను అందిస్తోంది.

Good News to Helpers in Tollywood

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆర్థిక సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ద్వారా ప్రమోట్ చేయబడిన మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్, ఎంటర్‌టైన్మెంట్ పరిశ్రమలోని వివిధ కార్యకలాపాలను స్ట్రీమ్ లైన్ చేయడంలో పాలుపంచుకున్న ప్రొడ్యూసర్ బజార్‌తో చేతులు కలిపింది. ఇది సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్లకు శిక్షణను అందిస్తోంది. సినిమా పరిశ్రమ చాలావరకు అసంఘటితంగా ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరా పర్సన్లు, అసిస్టెంట్ ఎడిటర్లు వంటి కార్మికులు తమకు తగిన గుర్తింపు, ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఉదాహరణకు, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని కుంగదీసినప్పుడు, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు లేకపోవడం వల్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు సాయం అందుకోలేకపోయారు. షార్ట్ టైమ్ సర్టిఫికేట్ కోర్సు వారికి వారి సంబంధిత రంగంలో అధికారిక శిక్షణను అందిస్తుంది, అంతేకాకుండా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ వంటి గుర్తింపు పొందిన సంస్థతో వారి వివరాలను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ శిక్షణ వారిని సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌గా ఉండేలా చేస్తుంది. వివిధ పథకాల నుండి ప్రయోజనం పొందేందుకు వారిని అర్హులుగా చేస్తుంది.

Also Read- Mahesh Babu @25: కథానాయకుడిగా మహేష్ 'రాజకుమారుడు' 25 సంవత్సరాలు పూర్తి

Fipchain Technology Pvt Ltd యొక్క సహ వ్యవస్థాపకుడు, CBO విజయ్ డింగారి దీనికి గురించి మాట్లాడుతూ.. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ఈ శిక్షణను భారతదేశం అంతటా నిర్వహిస్తోంది. దక్షిణాది వారితో భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. శిక్షణ త్వరలో ప్రారంభమవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలలోని కార్మికుల కోసం ఈ కోర్సు ఎంటర్‌టైన్మెంట్ రంగంలోని వివిధ సహాయకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నామని అన్నారు.


తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ దీనిని స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ మద్దతుతో కూడిన మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ (MESC) ప్రొడ్యూసర్ బజార్‌తో జతకట్టడంతో, సినిమా సహాయకుల డేటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. సినిమా సహాయకులు ఈ గుర్తింపుని పొందడం వలన వారు ప్రవేశపెట్టే ఏవైనా స్కీమ్‌ల నుండి ప్రయోజనాలను పొందడం సులభతరం చేస్తుంది కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. ప్రోగ్రామ్ కోసం ప్రవేశ రుసుము ఉంది, కానీ ఇది మీ కెరీర్‌లో విలువైన పెట్టుబడి.. అని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jul 31 , 2024 | 12:01 AM