మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Folk Singer Nernala Kishore: ‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ విడుదల

ABN, Publish Date - May 29 , 2024 | 09:03 PM

నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో తెలంగాణను సాధించుకుని పదేళ్లు కావొస్తున్న సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాటను చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ వహించగా.. ఈ పాటలో 200 మందికి పైగా కళాకారులు నటించారు.

Dachanna Darilo Thyagala Paata Launch

నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో తెలంగాణను సాధించుకుని పదేళ్లు కావొస్తున్న సందర్భంగా ‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ (Dachanna Darilo Thyagala Paata)ను చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ (Popular Folk Singer Nernala Kishore) వహించగా.. ఈ పాటలో 200 మందికి పైగా కళాకారులు నటించారు. ఈ పాట చిత్రీకరణ కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు, మొలంగూర్ గుట్టలపై చేశారు.

*Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..


తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలను కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించారు. ఈ పాటలో ప్రత్యేక పాత్రలో ప్రజా యుద్ధనౌక గద్దర్ వేషధారణలో ఏ.డీ.ఎం.ఎస్ శివాజీ (ADMS Shivaji) ఆకట్టుకున్నారు. ఈ పాటను తెలంగాణ అమరుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ పాటను ప్రతీ ఒక్కరూ ఆదరించాలని నేర్నాల కిషోర్ కోరారు. ఈ పాటను తెలంగాణ అమరుల కుటుంబాల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా MLC మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ, సినీ దర్శకులు ఎన్ శంకర్, హీరో సంజోష్, ప్రజా నాట్య మండలి విమలక్క, విమల గద్దర్ (వెన్నెల) పాల్గొన్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీ, డి.ఓ.పి శాంతిరాజ్ చేశారు. (Dachanna Darilo Thyagala Paata Launched)

Read Latest Cinema News

Updated Date - May 29 , 2024 | 09:03 PM