Exhibitors: సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు చెప్పేందుకు సిద్ధమైన ఎగ్జిబిటర్స్
ABN, Publish Date - Jul 23 , 2024 | 06:04 PM
తెలుగు రాష్ట్రాలలో థియేటర్ వ్యవస్ద ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమాలు తక్కువగా విడుదలవడం, విడుదలైన సినిమాలకు ప్రేక్షకాదరణ కూడా తక్కువగా ఉండటంతో పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌ను ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పటింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఎగ్జిబిటర్స్ తమకున్న సమస్యలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఒకవైపు ఓటీటీల హవా.. మరో వైపు థియేటర్లకు ప్రేక్షకులు అంతంత మాత్రంగా వస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాలలో థియేటర్ వ్యవస్థ (Theater System) ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమాలు తక్కువగా విడుదలవడం, విడుదలైన సినిమాలకు ప్రేక్షకాదరణ కూడా తక్కువగా ఉండటంతో పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌ను ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పటింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఎగ్జిబిటర్స్ (Exhibitors) తమకున్న సమస్యలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నారు.
గత నాలుగు నెలల కాలంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్ర విజయం మినహా, సరైన హిట్ చిత్రాలు లేకపోవడంతో ఎగ్జిబిటర్స్ ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో తమకున్న సమస్యలను సీఎం ముందు పెట్టి పరిష్కరించే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డిని వారు అపాయింట్‌మెంట్ కోరుతున్నారు. ప్రధానంగా నాలుగు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎగ్జిబిటర్స్ తీసుకువెళ్లదలిచారని తెలుస్తోంది. అవేంటంటే..
Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు
సినిమాకో టికెట్ రేట్ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 లేదా 150 ప్రామాణిక టిక్కెట్ ధర ఉండాలని. స్టార్స్ చిత్రాలకు పెంచిన ధరల విధానం వల్ల చిన్న చిత్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలియజేయనున్నారు.
థియేటర్ లైసెన్స్ పునరుద్ధరణ విషయంలో మూడేళ్ల తక్కువ కాల వ్యవధిని అమలు చేసినప్పటి నుండి పరిస్థితులలో మార్పులు వచ్చాయని.. కాబట్టి పునరుద్ధరణ వ్యవధిని 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పొడిగించాలని అభ్యర్థించనున్నారు
సినిమా థియేటర్స్‌కు సంబంధించి విద్యుత్ బిల్లుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి థియేటర్ యజమానులు పారిశ్రామిక యూనిట్ల మాదిరిగానే తక్కువ విద్యుత్ ధరలను కోరుతున్నారు.
ఇక థియేటర్ మార్పులకు అనుమతి ఇవ్వాలని.. థియేటర్స్ ప్రాంగణంలో కొంత భాగాన్ని కమర్షియల్‌గా ఉపయోగించుకునేందుకు, థియేటర్‌లను సవరించడానికి అనుమతిని అభ్యర్థిస్తున్నారు. వీటిలో ఫుడ్ కోర్ట్‌లు, రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసుకుని, తద్వారా ఆదాయాన్ని పొందగలిగే విషయాన్ని ఎగ్జిబిటర్స్ ప్రస్తావిస్తున్నారు.
థియేటర్ యజమానుల కష్టాలు, తెలంగాణలోని వినోద పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఏం రేవంత్ రెడ్డి అర్థం చేసుకుని, సమస్యలను పరిష్కరిస్తారని ఎగ్జిబిటర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Latest Cinema News