Middle Class People: ఇలా అయితే.. మధ్య తరగతికి చెందిన వారు సినిమాకు వస్తారా?

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:31 PM

‘దేవర’ సినిమాకు ఆ షో, ఈ షో అంటూ టికెట్ల ధరలను వేలలో అమ్మారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చనేలా జీవోలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో దిగువ తరగతి వారు అసలు థియేటర్ వైపు కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. ఇక మధ్య తరగతి వారు కూడా ఈ ధరలతో ఎంటర్‌టైన్‌మెంట్‌కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే..

Movie Theater

ఆరేళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) సోలో రిలీజ్‌గా విడుదలైన ‘దేవర’ (Devara) చిత్రాన్ని చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా పిలిచే తారక్‌కి యువతతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో‌ను మంచి క్రేజ్ ఉంది. కానీ.. మొదటి రెండు వారాల్లో ఎన్టీయార్ మధ్యతరగతి కుటుంబాలకు (Middle Class Family) చేరువ కాలేకపోతున్నాడు. మొదటి రోజు ప్రీమియర్ షో‌లో భాగంగా హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ రూ. 3000 నుంచి 5000 వరకు అమ్మారు. హీరోపై విపరీతమైన అభిమానంతో ఫ్యాన్స్ సినిమాకెళ్లిన ఓ సగటు మధ్య తరగతి అభిమానికి ఇది చాలా పెద్ద అమౌంట్. భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో ప్రస్తుతం తెలంగాణ (Telangana)లోని మల్టిప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర రూ. 300-500 వరకు పలుకుతోంది, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోను ఒక్కో టికెట్ ధర రూ. 300కి పైనే పలుకుతోంది. వీటితో పాటు టికెట్ ధర కంటే ఎక్కువగా ఉండే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ఖర్చు అదనం. ఇదంతా పక్కనబెడితే ఒక్క వాటర్ బాటిల్ కొనేందుకు కూడా సాధారణ ప్రజలు వెనుకాడుతున్నారంటే సినిమా మధ్య తరగతి మనిషికి ఎంత దూరమవుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బయటపెట్టిన లెక్కలు వింటే అందరూ నోటిఫై వేలేసుకోవాల్సిందే. కరణ్ బయటపెట్టిన లెక్కల ప్రకారం ఒక నలుగురు ప్రీమియం ప్లాన్‌లో సినిమాకి వెళ్ళాలి అంటే అక్షరాలా పది వేల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఒక్కో టికెట్‌పై యావరేజ్‌గా రూ. 300 ఖర్చు చేస్తే, ఫుడ్ పైన దానికంటే రెండు లేదా మూడింతలు మినిమం రూ. 600 ఖర్చు చేయాల్సి వస్తోందట.


ఇక మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) వెల్లడించిన లెక్కల ప్రకారం సగటు ఒక ఫ్యామిలీ (4గురు) సినిమాకి వెళ్ళాలి అంటే రూ. 1,560 ఖర్చువుతుంది. యావరేజ్‌గా ఒక టికెట్ పై రూ. 258 ఖర్చు చేస్తే ఫుడ్‌పై రూ. 132 ఖర్చు చేస్తున్నారట. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పండగలకి ఫ్యామిలీలతో ప్రేక్షకులు సినిమాలకి వెళ్లే కల్చర్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే లేకపోలేదు. ఈ విషయంలో సినిమా వారు, ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందనేలా మధ్య తరగతి సినిమా ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2024 | 10:33 PM