Megastar Chiranjeevi: చిరంజీవి డ్రగ్స్ యాడ్.. డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా! ఆయన చేసిన సినిమాలు ఏంటంటే
ABN, Publish Date - Jun 30 , 2024 | 01:17 PM
డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల యాంటీ డ్రగ్ యాడ్ ను తయారు చేయించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ప్రకటనకు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.
డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారు చేయించింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఈ ప్రకటనకు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దర్శకత్వం వహించడం విశేషం.
ఈ ప్రకటనను ఇటీవలే తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిలీజ్ చేశారు. ఈ యాడ్‌ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఇకపై ఈ యాడ్‌ను తెలంగాణలోని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడు చేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆర్థమయ్యేలా తెరకెక్కించాడు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మినా, కొన్నా వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెబుతూనే డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన వారికి చేయూత అందించి, వారిని తిరిగి మంచి మార్గంలో నడిచేలా తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సాయం అందిస్తుందో ఈ యాడ్‌లో చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) మాట్లాడుతూ.. ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి ఈ ఇండస్ట్రీకి రావాలనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్‌లో నేనూ ఒక భాగమైనందుకు ఈ జన్మకి ఇక చాలు అని అనిపిస్తుందని. కానీ మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదని అన్నారు.
గతంలో అల్లు శిరీష్‌తో ఏబీసీడీ (ABCD American Born Confused Desi)సినిమా, రాజ్ తరుణ్‌తో "అహ నా పెళ్లంటష (Aha Naa Pellanta)వెబ్ సిరీస్ తెరకెక్కించిన సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) ప్రస్తుతం విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini) జంటగా సంతాన ప్రాప్తిరస్తు (Santana Prapthirasthu) అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.