మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Director Mother: గీతా భాస్కర్ జీవితంలో ఆవకాయ ఎలా ఒక భాగం అయ్యిందంటే...

ABN, Publish Date - May 21 , 2024 | 02:36 PM

వేసవి కాలం వస్తే ఆవకాయ పెట్టుకోవాలి అనే విషయం ప్రతి తెలుగువాడి జీవితంలో ఇప్పుడు ఒక భాగం అయింది. ఆవకాయ తినని తెలుగువాడు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. అటువంటి ఆవకాయ ఎలా చెయ్యాలో, అందులో చిట్కాలు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మదర్ నటి గీత మాటల్లో...

Pop Singer Smitha, Geetha Bhascker and Producer Swapna Dutt

దర్శకుడు తరుణ్ భాస్కర్ మదర్ గీత భాస్కర్ ఇప్పుడు చాల తెలుగు సినిమాల్లో కనపడుతూ వుంటారు. ఒక హుందాగా వుండే పాత్రలో ఆమెని దర్శకులు చూపెడుతూ వుంటారు. నిజ జీవితంలో కూడా గీత భాస్కర్ విద్యావేత్త, బాగా చదువుకున్నామె, చాలామందికి ఆదర్శప్రాయం కూడా ఆమె. అటువంటి గీత భాస్కర్ ఆవకాయ గురించి చెపుతూ అది జీవితంలో ఒక భాగం అయిపోయిందని, పెళ్లయిన కొత్తలో ఆమె హైదరాబాదు వచ్చాక ఆవకాయ ఎలా తయారు చెయ్యాలో, ఎన్ని రకాలుగా కూడా చెయ్యొచ్చో కూడా నేర్చుకున్నని చెపుతూ అది ఎలా తయారు చెయ్యాలో చేసి చూపించారు.

జీవితంలో అవకాయ ఎలా చెయ్యాలో నేర్చుకొని, అనుభవంతో ఆవకాయ చెయ్యడంలో ఆమె నిష్ణాతులయ్యారు. మొదట్లో ఆమె ఆవకాయ చేసిన తరువాత బంధువులకి, స్నేహితులకి ఇచ్చినపుడు వాళ్ళు ఆమె చేసిన ఆవకాయ తిని మెచ్చుకుంటుంటే ఆ అనుభూతి వేరు అని చెపుతూ వుంటారు. ఇలా ఆమె చేత ఆవకాయ ఎలా చెయ్యాలో, ఏమేమి వేస్తె అవకాయకి గొప్ప రుచి వస్తుందో కమ్యూనిటీ కార్యక్రమాలలో భాగంగా 'ఓనమాలు', ది క్యులినరీ లాంజ్ అనే సంస్థ ఆమె చేత చేయించారు.

ఈ సందర్భంగా గీత భాస్కర్ తన జీవితానుభవం నుండి తెలుసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నారు. అలాగే ఆమె ఆవకాయను తయారు చేసే విధానం ఇక్కడ వాటికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఆవాల పొడిని ఉపయోగిస్తారు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతారు. 'ది క్యులినరీ' స్టూడియోలో వచ్చిన ఎంతోమంది అతిథుల కోసం, అవకాయని తయారు చేసే ప్రక్రియను ఆమె మళ్ళీ చేసి చూపించారు.

దానితో పాటు ఆమె అనేక చిట్కాలను కూడా అందరితో పంచుకున్నారు, అలాగే ఈ ఆవకాయ గురించి ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను అతిథులతో పంచుకున్నారు, అందరూ ఆమె చెప్పిన విషయాలను ఎంతో ఆసక్తికాగా విన్నారు. తురిమిన మామిడికాయ పచ్చడి, కొబ్బరి ముట్టి, రాజమండ్రి స్టయిల్ టొమాటో భజ్జీ, బెజవాడ మిరపకాయ భజ్జీలతో పాటు గుంత పొంగనాలుతో సహా చిన్నప్పటి నుంచి తమ ఆవకాయ జ్ఞాపకాలను అతిథులు పంచుకున్నారు.

ప్రముఖ నిర్మాత స్వప్న దత్ ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. గీత భాస్కర్ ఆవకాయ గురించి ఆమె కుమారుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ గొప్పగా చెప్పేవాడని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అని చెప్పారు. సంగీత దర్శకురాలు, పాప్ సింగర్ స్మిత ప్రత్యేక అతిధిగా వచ్చి గీత భాస్కర్ చేస్తున్న విధానాన్ని వీక్షించారు.

Updated Date - May 21 , 2024 | 04:18 PM