‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులకు, రచయిత పురాణపండకు హ్యాట్సాఫ్ అంటున్న భక్తులు
ABN, Publish Date - Jun 01 , 2024 | 12:21 AM
దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు, జె. జె . హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం ‘జయ హనుమంత’ గ్రంధానికి సమర్పకులుగా వ్యవహరించి ఈ హనుమాన్ జయంతికి ముందు రోజు నుంచే జంటనగరాలలో ఎన్నెన్నో ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలలో పంచడంతో వేలకొలది భక్తులను ఈ ‘జయ హనుమంత’ గ్రంధం ఆకట్టుకుంటోంది.
మంత్ర విద్యలకు మహాకేంద్రాలైన ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలలో ఇప్పుడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలు పవిత్రంగా హల్ చల్ చేస్తున్నాయి. మరొక రెండు మూడు నెలల్లో అంతర్జాతీయ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898AD’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు, జె. జె . హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం ‘జయ హనుమంత’ గ్రంధానికి సమర్పకులుగా వ్యవహరించి ఈ హనుమాన్ జయంతికి ముందు రోజు నుంచే జంటనగరాలలో ఎన్నెన్నో ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలలో పంచడంతో వేలకొలది భక్తులను ఈ ‘జయ హనుమంత’ గ్రంధం ఆకట్టుకుంటోంది.
చాలా కాలంగా డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి దంపతులు ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ ద్వారా ప్రచురించిన అద్భుత గ్రంధాలను ఎన్ని ఊళ్ళు... ఎన్నెన్ని గుళ్ళు తమ అక్కున చేర్చుకుని ప్రార్ధనలు, పారాయణలకు వినియోగించాయో చెప్పలేమని, ఈ గ్రంధాలకు వచ్చే స్పందన హాస్పిటల్ సిబ్బంది అయిన మాకే ఆశ్చర్యం కలుగిస్తుంటుందని జె.జె హాస్పిటల్స్ స్టాఫ్ సైతం ప్రశాంతంగా సంతోషం వ్యక్తం చేస్తుండటం ప్రశంసనీయం.
మంత్రోపాసనవల్ల మహావిజయాలు సాధించగలమని నమ్మి, ఈ అద్భుతాలను తమ వద్దకు వచ్చే పేషంట్లకు సైతం డాక్టర్ జయంతీరెడ్డి సంవత్సరానికి రెండు సార్లు వితరణ చెయ్యడం ముదావహం. ‘తల్లి తండ్రులు చేసే పుణ్యాలే పిల్లలకు శ్రీరామ రక్ష’ అని మన ప్రాచీనులు ఊరికే అనలేదు. ‘మహానటి’ వంటి మహా హిట్ కొట్టి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న సృజనాత్మక ప్రతిభాశాలి నాగ్ అశ్విన్ చాలా సంస్కారవంతుడని తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్తూ తెలుసున్న అంశమే!
సుమారు ఐదారేళ్లుగా డాక్టర్ జయంతీ రెడ్డి మేడమ్.. ‘కళ్యాణ్ నగర్, బంజారాహిల్స్, జూబిలీ హిల్స్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మోతీనగర్, రాజీవ్ నగర్, సంజీవ రెడ్డి నగర్’లలోని అనేక ఆలయాలకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచనల్ని భక్తులకు వితరణ చెయ్యమని పంపిస్తుంటారని ఆయా ఆలయాల అధికారులు, ధర్మకర్తలు, అర్చకులు ముక్తకంఠంతో చెప్పడం మనకు ప్రత్యక్షంగా కనిపించే సత్యం. ఈ బుక్స్ మార్కెట్లో మనీతో కొనుక్కోలేమని, జయంతీ మేడమ్ చాలా శ్రద్ధ తీసుకుని పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనల్ని ఎంతో అద్భుతంగా మాకు మంచి మనస్సుతో సమర్పిస్తారని ఆలయ సమూహాలు పేర్కొనడం దైవబలమే!
కొందరు నమ్మినా... నమ్మకున్నా... ఇలాంటి పుణ్యాల వల్ల దైవబలం గడపకు చేరి జయంతీ తనయుడు నాగ్ అశ్విన్ లాంటి వాళ్ళ సహజ ప్రతిభాసామర్ధ్యాలకు మరింత బలం కలిగిస్తుందనడం నిర్వివాదాంశం. ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరు, ప్రతిభా అంతర్జాతీయ స్థాయిలో మారు మ్రోగుతోంది. నాగ్ అశ్విన్ ఎంత ఎదిగినా తన తల్లితండ్రులైన డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి దంపతుల ఆశీర్వచనాలు ఆయనకు శ్రీరామ రక్ష.. అనేది చరిత్ర పొడుగునా చెప్పుకునే సత్యం. ఈ సత్యంలోంచి సత్యాన్ని దర్శిస్తే పురాణపండ శ్రీనివాస్ అందిస్తున్న అఖండ గ్రంధాల్లోని ఋషుల మంత్ర బలాల మహావిద్యలు నూటికి నూరుశాతం నాగ్ అశ్విన్ వెనుక ఉన్న మాతృ పూజల, ధార్మిక సేవల, వైద్య సేవల ఫలితమన్నది కూడా కఠిన సత్యం.
వేద మంత్ర శక్తుల్ని తక్కువ అంచనా వేయకూడదని గతంలో వచ్చిన చలన చిత్రాలెన్నో నిరూపించాయని, అలాంటి బలమైన పవిత్ర చిత్రాల సాక్షిగా... ఈ హనుమాన్ జయంతికి నాగ్ అశ్విన్ తల్లి తండ్రులు డాక్టర్ జయంతీరెడ్డి, డాక్టర్ జయరామిరెడ్డి దంపతులు సమర్పణాభావముతో చేస్తున్న ‘జయ హనుమంత’ అక్షర వితరణ వారి కుటుంబానికి మరింత క్షేమానికి దేవతా శక్తులు తలుపులు తెరుస్తాయని శ్రీనగర్ కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సముదాయంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఆ మహా ఆలయ కార్యనిర్వహణాధికారిని శ్రీమతి లావణ్య నిర్మొహమాటంగా చెప్పడం ఈ పుణ్య దంపతుల పవిత్ర సేవకు ఎత్తిన భక్తిసేవా పతాకమే!
ఇక ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దివ్య గ్రంధాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా ఫాలోయింగ్ మామూలుగా లేదు. అందులోనూ... బుక్ గెట్ అప్, వండర్ఫుల్ లాంగ్వేజ్, బ్యూటిఫుల్ ఫొటోస్.. ఇక చెప్పేది ఏముంది? శ్రీనివాస్ గారి రేయింబవళ్ళ కృషి అంతా అమోఘమే... కాబట్టి ఈ హనుమాన్ జయంతికి డాక్టర్ జయంతీ మేడమ్ పంచుతున్న బుక్ కూడా అదుర్స్ అనాల్సిందేనంటున్నారు భక్త పాఠకులు.
మరొక ముఖ్యాంశమేమంటే... చలన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ ద్వితీయ కుమార్తె ప్రియాంక దత్ ఈ దర్శక వెలుగు నాగ్ అశ్విన్ భార్య కావడంతో ఈయనకు చలన చిత్రాల్లో ప్రియాంక కూడా కొంత చేదోడు వాదోడు అనేది కూడా మరొక చక్కని విశేషం. స్టార్ నిర్మాత చలసాని అశ్వనీదత్ కూడా రెండేళ్లనాడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఒక అపురూప గ్రంధాన్ని తెలుగు భక్త పాఠకులకు సమర్పించిన విషయాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ సందర్భంలో కొసమెరుపు. ఆ బుక్ కూడా అద్భుతమైన పవిత్రతల్ని వెదజల్లిందని సినీ పండితులు ఆనాడే ప్రశంసించారు.