మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OLD: క్రైమ్ థ్రిల్లర్ కథతో.. ఓఎల్ డీ

ABN, Publish Date - Apr 10 , 2024 | 02:13 PM

రాకేష్ శ్రీపాద దర్శకత్వంలో మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం "ఓఎల్ డీ".

old

రాకేష్ శ్రీపాద దర్శకత్వంలో మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో జి రాణి నిర్మాతగా అల్టిమేట్ సినీ ప్లానెట్ (Ultimate Cine Planet) పాతకం పై నిర్మించబోతున్న చిత్రం "ఓఎల్ డీ" (OLD). 2008 కాలంలో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తారు. ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.


దర్శకుడు రాకేష్ శ్రీపాద మాట్లాడుతూ "ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ. మా చిత్రానికి "ఓ ఎల్ డి" టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాము. మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.

Updated Date - Apr 10 , 2024 | 02:15 PM