Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు
ABN, Publish Date - Oct 05 , 2024 | 09:57 AM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో పోలీస్ కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఓ లాయర్ పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పై తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో పోలీస్ కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin) పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. మదురైకి చెందిన ఓ లాయర్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. సనాతన ధర్మం పేరుతో ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు యుద్ధానికి దిగారు. వారి మధ్య జరుగుతున్న ఈ వార్ ఆసక్తికరంగా మారింది.
Also Read- Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. తమిళనాడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది కరోనా కంటే ప్రమాదమని.. మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదంటూ ఎన్నికల ప్రచారంలో బిజెపిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. స్వయంగా నరేంద్ర మోదీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు.
Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్
ఇలాంటి నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్షను ముగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ఈ స్పందనలో పేరు ప్రస్తావించకు పోయినప్పటికీ పరోక్షంగా ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్లు కనిపించింది. సనాతన ధర్మాన్ని కొంతమంది డెంగ్యూ అలాగే మలేరియా లాంటి వాటితో పోలుస్తున్నారని... అలాంటి వారి వల్ల ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read- King Nagarjuna: రాజకీయ నాయకులకు కింగ్ నాగ్ హెచ్చరిక
అయితే సనాతన ధర్మ రక్షణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వెయిట్ అండ్ సి’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే.. పవన్ కళ్యాణ్‌పై మధురైలో పోలీస్ కేసు నమోదైంది. ఓ లాయర్ పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టారు. ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కేసు నమోదు పెట్టారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. అయితే ఈ కేసు గురించి తెలిసిన హిందూ సంఘాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడినప్పుడు లేవని నోరులు.. ఆ ధర్మ రక్షణ నిమిత్తం చేసిన వ్యాఖ్యలపై కేసులు పెడతారా? అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.