40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jan 31 , 2024 | 08:59 PM

సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే నంది పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నంది అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డుగా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

CM Revanth Reddy

సినీ కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే నంది పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. కళాకారులకు ఇచ్చే నంది అవార్డు (Nandi Award) పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును ఇక నుంచి గద్దర్ అవార్డు (Gaddar Award)గా అందజేయడం జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందజేస్తామని ప్రకటించారు.

హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తాం. ఈ వేదికగా చెబుతున్నా.. ఇదే శాసనం.. ఇదే జీవో. వచ్చే ఏడాది నుండి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేసిన విషయం తెలిసిందే.


ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం సింహా (Simha) అవార్డులు ఇస్తుందని తెలంగాణకు చెందిన గత ప్రభుత్వంలోని అధికారులు ప్రకటించారు. అది ప్రకటనకే సరిపోయింది కానీ.. కార్యరూపం దాల్చలేదు. ప్రతి సంవత్సరం సింహా అంటూ హడావుడి జరగడం.. ఆ తర్వాత కామ్ అయిపోవడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీ, కవులు, కళాకారుల కోసం నంది స్థానంలో గద్దర్ అవార్డ్‌ను, అవార్డ్ ఇచ్చే డేట్‌ని కూడా ఖరారు చేయడంతో.. మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

*Saindhav: ‘సైంధవ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌లో చిన్న మార్పు.. విడుదల ఎప్పుడంటే?

**************************

Updated Date - Jan 31 , 2024 | 08:59 PM