Pushpa 2: పుష్పరాజ్ వర్క్‌పై ముఖ్యమంత్రి హ్యాపీ.. రష్మిక కూడా సపోర్ట్

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:08 AM

‘పుష్పరాజ్’ చేసిన పని ఈ సీఎంని మెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. టీమ్‌ని అభినందించారు. ఇంతకీ పుష్పరాజ్ ఏం చేశాడు? సీఎం ఎందుకు అభినందించాడు? అనేది తెలుసుకోవాలంటే..

Allu Arjun in Pushpa

‘పుష్పరాజ్’ చేసిన పని తనకెంతో నచ్చిందని, అతను ఆ పని చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి? అసలు పుష్పరాజ్ ఏం చేశాడని అనుకుంటున్నారా? ముందు ఆ ముఖ్యమంత్రి ఎవరూ అనే విషయానికి వస్తే.. సినిమా వాళ్లు టిక్కెట్ల ధరలు పెంచమని మా దగ్గరకు రావడం కాదు.. సమాజం పట్ల చిరంజీవిగారిలా కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలనే కండీషన్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల కోసం సినిమా వాళ్లు కాస్త బాధ్యతగా వ్యవహరించారని చెబుతూ.. ప్రతి సినిమాకు ముందు సమాజంపై చెడు ప్రభావం చూపించే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఓ వీడియో చేస్తేనే.. మా దగ్గరకు టిక్కెట్ల ధరల పెంపుకుగానీ, అదనపు షోల అనుమతికిగానీ రావాలంటూ షరతు విధించిన విషయం తెలిసిందే.

Also Read- Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు


సీఎం విధించిన ఈ షరతు తర్వాత విడుదలైన పెద్ద సినిమాల హీరోలందరూ వీడియోలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్పరాజ్’ వంతు వచ్చింది. పుష్పరాజ్ తన వంతుగా డ్రగ్స్ రహిత తెలంగాణపై ఓ వీడియోను చేసి సోషల్ మాధ్యమాలలో విడుదల చేశారు. ఈ వీడియో చూసిన సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తంగా చేస్తూ.. ‘డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం మనమంతా చేతులు కలుపుదాం’ అని చెబుతూ ‘సే నో టు డ్రగ్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్‌కు వెంటనే అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చొరవకు అభినందనలు’ అని అల్లు అర్జున్ కామెంట్ చేశారు.


ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పోస్ట్‌లు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, హీరోలేనా, హీరోయిన్లు అవసరం లేదా? మేము చెబితే వినరా? అనేలా రష్మిక కూడా ఈ క్యాంపెయిన్‌కు సపోర్ట్ ఇస్తూ.. ఓ వీడియోను చేయడం విశేషం. ఆమె తెలంగాణ ‘షీ టీమ్’కు సపోర్ట్‌గా ఓ వీడియోను చేసి.. సైబర్ క్రైమ్ వ్యవహారాలలో అమ్మాయిలెవరూ భయపడవద్దని, ఎక్కడ తమ పేరు బయటకు వచ్చి కెరీర్ పాడవుతుందని లోలోన మదనపడుతుంటారో.. అలాంటి వారందరూ షీ టీమ్‌ని ఆశ్రయించాలని, మీ సమాచారం రహస్యంగా ఉంచి.. మీకు న్యాయం చేస్తారని తెలుపుతున్న రష్మిక వీడియో సైతం వైరల్ అవుతోంది.

Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..

Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే

Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్ష‌జ్ఞ'

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2024 | 10:10 AM