Rimi Sen: మోటార్ కంపెనీపై ఏకంగా రూ.50 కోట్ల దావా వేసిన చిరు హీరోయిన్!

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:08 PM

రిమీ సేన్ గుర్తుందా? మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘అందరివాడు’ సినిమాలో.. కొడుకు పాత్రకు పెయిర్‌గా చేసిన హీరోయిన్ రిమీ సేన్. తాజాగా ఈ భామ వార్తలలో నిలుస్తూ.. ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఆమె ఓ మోటార్ కంపెనీపై దావా వేయడమే. ఆ దావా కూడా అంత ఇంత కాదు.. ఏకంగా రూ. 50 కోట్లు. అంతే, ఒక్కసారిగా ఆమెపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

Heroine Rimi Sen

రిమీ సేన్ (Rimi Sen) గుర్తుందా? మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ద్విపాత్రాభినయం చేసిన ‘అందరివాడు’ (Andarivaadu) సినిమాలో.. కొడుకు పాత్రకు పెయిర్‌గా చేసిన హీరోయిన్ రిమీ సేన్. తాజాగా ఈ భామ వార్తలలో నిలుస్తూ.. ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఆమె ఓ మోటార్ కంపెనీపై దావా వేయడమే. ఆ దావా కూడా అంత ఇంత కాదు.. ఏకంగా రూ. 50 కోట్లు. అంతే, ఒక్కసారిగా ఆమెపై వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే..

Also Read- HBD MegaStar: ఆ మాటతో మొదలై.. పద్మవిభూషణ్‌ వరకూ!


తాజాగా ఆమె తన రేంజ్ రోవర్ కార్‌ (Range Rover Car)లో అనేక సమస్యలను ఎదుర్కొన్న క్రమంలో కార్ ఉత్పత్తిదారులపై దావా వేసింది. పలుసార్లు ఆ కార్ల కంపెనీ దగ్గరకు రిపేర్ల నిమిత్తం వెళ్లినప్పటికీ వారు సరిగా స్పందించక పోవడంతో లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. లీగల్ చర్యల్లో భాగంగా నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ మరియు సతీష్ మోటార్స్‌లకు నోటీసులు పంపబడ్డాయి. నోటీసులు ఆమె అసలు పేరైన సుభమిత్ర సేన్‌తో పంపినట్లుగా తెలుస్తోంది.


25 ఆగస్ట్, 2022న రిమీ సేన్ తన కారు వెనుక కెమెరా పనిచేయకపోవటంతో.. రివర్స్ చేస్తున్నప్పుడు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనకు ముందు కూడా రిమీ సేన్ కారుతో అనేక సమస్యలను ఎదుర్కొన్నానని చెబుతోంది. ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో అనేక సార్లు సంబంధిత డీలర్‌షిప్‌లను సందర్శించినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదని.. తన వాహనంతో నిరంతరం సమస్యలతో విసుగు చెందిన తరుణంలో.. మానసిక వేదనను గురయ్యానంటూ.. పరిహారంగా తనకు‌‌ నష్టపరిహారం ఇవ్వాలని సదరు కంపెనీలకు లీగల్ నోటీసులను జారీ చేసింది.

పిల్లర్ స్థానంలో పర్సన్ ఉంటే చాలా ప్రమాదం సంభవించేదని.. ఇలా మానసికంగా ఎంతో విసిగిపోయానని ఆమె చెప్పుకొచ్చింది. కారులో సమస్యల కారణంగా డీలర్ షిప్ మరియు కారు తయారీదారుల నుండి రూ. 50 కోట్లు, అలాగే చట్టపరమైన ఖర్చుల నిమిత్తం మరో రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొనడం విశేషం. ఈ విషయంలో కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని రిమీ సేన్ భావిస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 22 , 2024 | 06:08 PM