Chandrababu- Pawan Kalyan: ఒకరికొకరు అభినందనలు.. ఇది బాండింగ్ అంటే..
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:51 PM
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రతి రోజూ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఎన్నికలలో విజయం అనంతరం.. వీరిద్దరి పాలనా దక్షత, విధి నిర్వహణపై నిత్యం వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరి ట్విట్టర్ ఎక్స్ సంభాషణ మరోసారి వారిని వార్తలలో ఉంచింది. ఆ సంభాషణ ఏంటంటే..
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Chandrababu Naidu)ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రతి రోజూ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఎన్నికలలో విజయం అనంతరం.. వీరిద్దరూ ప్రతి విషయంలో చూపుతున్న చొరవ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఇస్తోన్న ప్రాముఖ్యత ఏంటనేది ప్రత్యక్షంగా అంతా చూస్తూనే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విషయంలో చంద్రబాబుగారే స్ఫూర్తి అనేలా ముందుకు వెళుతున్నారు. అలా వీరి బాండింగ్‌ని చూసి ఇతర పార్టీలు సైతం కుళ్లుకునే పరిస్థితి నేడు ఏపీలో ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన రూ. 6 కోట్ల విరాళంపై చంద్రబాబు ప్రశంసలు కురిపిస్తూ, అభినందనలు తెలియజేస్తే.. ఈ విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు పాలనా దక్షత, విధి నిర్వహణను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రస్తుతం వారి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా జరిగిన వారి సంభాషణ ఇదే..
Also Read- Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
‘‘వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు నా అభినందనలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణ వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు చేసేందుకు మరో రూ.కోటి ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతున్నది. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కళ్యాణ్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను..’’ అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
చంద్రబాబు ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, RWS శాఖలు యుద్ధప్రతిపదికన పాల్గొంటున్నారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నాను...’’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో చంద్రబాబుపై అభినందనలు కురిపించారు.
Read Latest Cinema News