నిర్మాత కొర్రపాటి సాయి అమృతేశ్వరుని సన్నిధిలో మహాత్ములు చాగంటి

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:52 AM

ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో సుమారు పాతిక కోట్లతో.. రాజమౌళి, రమా రాజమౌళిల సమక్షంలో పరమాద్భుతమైన, అరుదైన కృష్ణ శిలలతో భారతదేశంలోనే మొదటి శివాలయమైన ‘శ్రీ అమృతేశ్వర దేవస్థానం’ని నిర్మించిన వార్త కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో పవిత్ర సంచలనం సృష్టించిన విషయం భక్తులకూ, రాజకీయ, సినీవర్గాలకూ తెలిసిందే. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు చాగంటి సందర్శించారు.

ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అందించిన చిత్రం ‘ఈగ’ చలన చిత్రంతో జాతీయ స్థాయిలో పేరుపొందారు. నిర్మాత సాయి కొర్రపాటి గత సంవత్సరం తన ఆత్మబంధువులైన విఖ్యాత దర్శకులు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి, శ్రీమతి రమా రాజమౌళి దంపతుల సమక్షంలో వందలాది వేదపండితుల వేదఘోషల నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో సుమారు పాతిక కోట్లతో పరమాద్భుతమైన, అరుదైన కృష్ణ శిలలతో భారతదేశంలోనే మొదటి శివాలయాన్ని ‘శ్రీ అమృతేశ్వర దేవస్థానం’గా నిర్మించిన వార్త కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పవిత్ర సంచలనం సృష్టించిన విషయం భక్తులకూ, రాజకీయ, సినీవర్గాలకూ ఎరుకే.

ఇంతటి మహా శక్తిసంపన్నమైన అద్భుత మహాస్పటికలింగ ఆలయం నిర్మించాలనే సాయి కొర్రపాటి ఆలోచనకు బీజం పడటానికి కారణం నిస్సందేహంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌తో వున్న గాఢమైన పరిచయం, స్నేహం వల్లనేనని నాటి నుంచి నేటి వరకూ ఇటు ఫిలిం నగర్ వర్గాలూ, అటు సాయి కొర్రపాటి సన్నిహితులూ బాహాటంగా చెబుతూనే ఉన్నారు.

జీవన యాత్రలో ఎన్నో సవాళ్లెదుర్కున్న పురాణపండ శ్రీనివాస్ ఒక అద్భుత రచయితగా, చక్కని వక్తగానే కాకుండా నిస్వార్థమైన అపురూప విలువలున్న మానవీయ వ్యక్తిగా సాహిత్య కవిత్వ ఆధ్యాత్మిక ప్రపంచాలకు చిరపరిచితం.

ఇదిలా ఉండగా బళ్లారి చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ.. వందలు వేలుగా భక్తుల వరాలు నెరవేర్చే శివయ్యగా పేరుపొందిన ఈ అమృతేశ్వరుని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ఙ్ఞానసరస్వతీ స్వరూపులు , పుంభావసరస్వతి ఆచార్య చాగంటి కోటేశ్వరరావు దర్శించారన్న వార్త అటు చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు క్షణాల్లో వ్యాపించడంతో ఆ మహా పండితుని చూసేందుకు ఎందరో తరలి వచ్చారు. చాగంటి వారి ఆగమనానికి శ్రీ అమృతేశ్వర ఆలయ అర్చక బృందం పూర్ణ కుంభ స్వాగతం, వేద మంత్ర పఠనంతో స్వాగతం పలికి ఆలయ విశేషాల్ని, శ్రీ అమృతేశ్వర ఆలయ స్థాపకులైన కొర్రపాటి సాయి ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించిన విశేషాల్ని వివరించారు. అనంతరం పంచలోహ సౌందర్యంతో విరాజిల్లుతున్న వారాహి దివ్య ప్రతిమను బహూకరించారు.

ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమోఘంగా రూపొందించిన, రచించిన మూడు దైవీయ గ్రంధాల పరమ పవిత్రమైన శ్రీ అమృతేశ్వర ఆలయం ఫైల్‌ను చాగంటి కోటేశ్వరరావు గర్భగుడి ముందే ఆవిష్కరించి ఆశ్చర్యంగా తిలకించడం విశేషంగానే పేర్కొనాలి.

గత రెండు రోజులుగా బళ్లారి వైశ్య ప్రముఖులు కొందరు భారీస్థాయిలో ఏర్పాటు చేసిన చాగంటి ప్రసంగాలకు వేలల్లో భక్తులు హాజరై ఆనందంలో ఓలలాడటం పాత్రికేయిలకు సైతం కన్నులముందే కనిపించింది.


గతంలో కాకినాడలో ఉండగానే చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ ద్వారా ఈ ఆలయం గురించి తెలుసుకున్నానని.. అయితే తనకు ఇన్నాళ్లకు ఈ శ్రీ అమృతేశ్వరుని దర్శించే భాగ్యం కలిగిందని, ఇది ఎంతయో భాగ్యమని కోటేశ్వరరావు పారవశ్యంతో ఆలయబృందం వద్ద పేర్కొన్నారు.

ఈ ఆలయ నిర్మాతలైన కొర్రపాటి సాయి వంశం తరించి పోయిందని చాగంటి కోటేశ్వర రావు నోట స్పష్టం చెయ్యడం గమనార్హం. ఇదే సందర్భంలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలపట్ల తనకి ఉన్న ప్రేమ ప్రక్కవారికి చాగంటి చెప్పడం కనిపించింది.

తన చుట్టూ చాలామంది తనతో ఉన్నప్పటికీ.. పురాణపండ శ్రీనివాస్ మంగళ గ్రంధాల బుక్స్ ఫైల్ ని తానే స్వయంగా పట్టుకుని చాగంటి వారే కార్ ఎక్కడం ఆయనకు దైవ గ్రంధాలపట్ల ఉన్న భక్తిని మరొకసారి స్పష్టంగా దర్శనమిచ్చింది.

ఏది ఏమైనా సాయి కొర్రపాటి ధన్య జీవులని బళ్లారి గ్రామం అంతా గొప్ప టాక్ నడిచింది. సమయానికి సాయి కొర్రపాటి బళ్లారిలో లేకపోవడంతో ఆయన సన్నిహితులు చాగంటి వారిని సకల మర్యాదలతో ఆలయానికి తీసుకు వచ్చారు.

Updated Date - Nov 29 , 2024 | 02:34 PM