Anant Radhika Wedding: భువిపైకి దిగివచ్చిన తారలు.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Jul 13 , 2024 | 02:40 AM

ప్రపంచ ధనవంతులలో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు అన్నంత వైభవంగా జరుగుతోంది. ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలెందరో హాజరయ్యారు. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలివే..

Celebrities at Anant Radhika Wedding

ప్రపంచ ధనవంతులలో ఒకరైన ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు అన్నంత వైభవంగా జరుగుతోంది. ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలెందరో హాజరయ్యారు. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలివే..


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మారంగ దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ హిందూ సంప్రదాయ పద్ధతిలో శుక్రవారం దంపతులు అయ్యారు. ముంబైలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.


యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, శాంసంగ్‌ చైర్మన్‌ జేలీ తోపాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దక్షిణాది సినీ తారలు రజనీకాంత్‌, మహేష్ బాబు, రామ్‌చరణ్‌, రానా దగ్గుబాటి, అఖిల్ అక్కినేని తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.



Updated Date - Jul 13 , 2024 | 02:50 AM