Bigg Boss 8: బిగ్ బాస్ 8 హౌస్‌లోకి అడుగుపెట్టిన పెయిర్స్ ఎవరెవరంటే?
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:27 PM
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సరికొత్త సీజన్ షురూ అయింది. బుల్లితెర సెన్సేషన్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ కింగ్ నాగార్జున ఈ లాంఛింగ్ షోని ఆసక్తికరంగా ప్రారంభించారు. ఈ షోలోకి అడుగుపెట్టిన పెయిర్స్ వివరాలివే..
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Biggboss 8) సరికొత్త సీజన్ షురూ అయింది. బుల్లితెర సెన్సేషన్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) ఈ లాంఛింగ్ షోని ఆసక్తికరంగా ప్రారంభించారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్.. పెయిర్స్ సీజన్‌గా ఉండబోతుంది. హౌస్‌లోకి కింగ్ నాగార్జున మొత్తంగా 7 పెయిర్స్‌ని పంపించారు. ఆ పెయిర్స్ వివరాలివే..
ఫస్ట్ పెయిర్: యష్మీ, నిఖిల్
ఈ సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ ఎంట్రీ ఇచ్చింది. బడ్డీ కాన్సెప్ట్‌లో భాగంగా.. ఆమెకు బడ్డీగా, అలాగే రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నిఖిల్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్‌లోని అడుగు పెట్టిన మొట్టమొదటి జంటగా వీరు పేరు సొంతం చేసుకున్నారు.
సెకండ్ పెయిర్: అభయ్ నవీన్, ప్రేరణ
మొదటి పెయిర్ హౌస్‌లోకి అడుగుపెట్టిన అనంతరం.. మూడో కంటెస్టెంట్ ‘పెళ్లిచూపులు’ విష్ణు అలియాస్ అభయ్ నవీన్‌ను ఆహ్వానించారు. తనకు వచ్చిన బడ్డీ కార్డులో సీరియల్ నటి ప్రేరణ నాల్గవ కంటెస్టెంట్‌గా స్టేజ్ పైకి అడుగుపెట్టింది. ఈ కపుల్‌ను నాగ్ హౌస్‌లోకి పంపించారు.
థర్డ్ పెయిర్: ఆదిత్య ఓం, సోనియా
రెండు పెయిర్లు హౌస్‌లోకి వెళ్లిన అనంతరం.. ‘35 చిన్న కథ కాదు’ మూవీ టీమ్ కాసేపు సందడి చేసింది. ఈ టీమ్‌ని హౌస్‌లోకి పంపి.. చిన్న గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో ఓడిపోయిన వారి పేరిట ఓ బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈసారి బిగ్ బాస్‌లో కెప్టెన్ ఉండరు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు అని ప్రకటించి షాక్ ఇచ్చారు. అనంతరం నాగ్ ఐదవ కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. అతనికి బడ్డీగా సోనియా 6వ కంటెస్టెంట్‌గా స్టేజ్ పైకి వచ్చింది. ఈ పెయిర్‌తో కాసేపు ముచ్చటించిన అనంతరం నాగ్ హౌస్‌లోకి పంపించారు.
ఫోర్త్ పెయిర్: బెజవాడ బేబక్క, శేఖర్ బాషా
ఇక నాలుగో పెయిర్‌గా హౌస్‌లోకి ఇంట్రస్టింగ్ పర్సన్స్ అడుగు పెట్టారు. ఈ పెయిర్‌లో ముందుగా 7వ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇస్తే.. ఆమె బడ్డీగా ఈ మధ్య వార్తలలో బాగా వైరల్ అవుతోన్న శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. ఈ పెయిర్‌తో కాసేపు ఎంటర్‌టైన్ చేసిన నాగ్ అనంతరం వారిని హౌస్‌లోకి పంపించారు.
ఫిప్త్ పెయిర్: కిరాక్ సీత, నాగ మణికంఠ
హౌస్‌లోకి 9వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది కిరాక్ సీత. ఆమెకు బడ్డీ కాన్సెప్ట్ చెప్పి కార్డు చెప్పించిన నాగ్.. 10 కంటెస్టెంట్‌గా ఇంట్రస్టింగ్ పర్సన్ నాగ మణికంఠను స్టేజ్ పైకి ఆహ్వానించారు. నాగ మణికంఠ లైఫ్ స్టోరీని స్టేజ్‌పై చెప్పించిన నాగ్ ‘ఆఖరి పోరాటం’ పేరుతో ఓ బయోపిక్ కూడా తీయవచ్చంటూ కాస్త ఎమోషన్‌లోకి తీసుకెళ్లారు.
సిక్త్ పెయిర్: పృథ్వీరాజ్, యాంకర్ విష్ణు ప్రియ
సిక్త్ పెయిర్ అనౌన్స్‌మెంట్‌కు ముందు ‘సరిపోదా శనివారం’ హీరోహీరోయిన్లతో కాసేపు సందడి నెలకొంది. నాని, ప్రియాంకలతో సినిమా కబుర్ల అనంతరం ఆ పెయిర్‌ని హౌస్‌లోకి పంపించి.. కొత్తగా వెళ్లిన వారితో గేమ్ ఆడించారు. ఆ గేమ్‌లో ఓడిన వారికి బ్యాడ్ న్యూస్ అంటూ ‘నో రేషన్’ అని నాగ్ ప్రకటించారు. ఇక సిక్త్ పెయిర్ 11వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్, అతని బడ్డీగా యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అనంతరం వారితో కాసేపు ముచ్చటించి నాగ్ హౌస్‌లోకి పంపించారు.
లాస్ట్ పెయిర్: నైనిక, నబీల్ ఆఫ్రీది
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే లాస్ట్ పెయిర్ అంటూ.. కింగ్ నాగ్ నైనికను పిలిచారు. ఆమె మాస్ పెర్ఫార్మన్స్ ఎంట్రీ తర్వాత బడ్డీ కార్డు ఎన్నుకుంది. ఆ కార్డు ద్వారా 14వ కంటెస్టెంట్‌గా వరంగల్ కుర్రాడు నబీల్ ఆఫ్రీది స్టేజ్ పైకి వచ్చారు. ఈ పెయిర్‌ని హౌస్‌లోకి పంపిన అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించి ఓ ఫ్రాంక్ ట్విస్ట్ ఇచ్చారు. అనంతరం లాస్ట్‌గా వెళ్లిన ఇద్దరి కపుల్స్‌తో గేమ్ ఆడించి.. ఓడిన వారికి బ్యాడ్ న్యూస్ అంటూ ‘జీరో ప్రైజ్ మనీ’ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ జీరోని లిమిట్ లెస్‌కి తీసుకెళ్లే బాధ్యత కంటెస్టెంట్స్‌దే అంటే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు.