Bigg Boss 8 Telugu: ‘తొక్కలో నామినేషన్’.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు

ABN, Publish Date - Oct 22 , 2024 | 10:48 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా మొదలైంది. అసలు ఎవ్వరూ తగ్గేదే లే అన్నట్లుగా ఈ నామినేషన్స్‌లో మాటల తూటాలు పేల్చుతున్నారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా.. కంటెస్టెంట్స్ ఒకరినొకరు తిట్టుకోవడం ఎక్కువగా కనిపించింది. అసలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే..

Bigg Boss 8 Telugu Episode 51 Review

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో (Bigg Boss Telugu Season 8) ఎనిమిదో వారం నామినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా మొదలైంది. అసలు ఎవ్వరూ తగ్గేదే లే అన్నట్లుగా ఈ నామినేషన్స్‌లో మాటల తూటాలు పేల్చుతున్నారు. మరీ ముఖ్యంగా రోహిణి, పృథ్వీ.. ప్రేరణ, విష్ణు.. హరితేజ, ప్రేరణల మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. ఇక విష్ణు ప్రియ (Vishnu Priya) వీక్షకులకు చిరాకు తెప్పించే కారణాలతో నస పెట్టిన ఫీలింగ్‌ని కలిగించింది. మొత్తంగా అయితే ఈ నామినేషన్ ఎపిసోడ్ కాస్త ఇంట్రస్టింగ్‌గా.. ఇంకాస్త నసగా సాగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే..

Also Read- Vishal: విజయ్‌ పిలవకపోయినా వెళతా.. హీరో విశాల్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ వారం నామినేషన్ ప్రక్రియ విష్ణు ప్రియతో మొదలైంది. మెగా ఛీప్‌గా ఉన్న గౌతమ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉండడని బిగ్ బాస్ చెప్పడంతో పాటు నామినేషన్ షీల్డుని ఎవరికి ఇవ్వాలనేది కూడా గౌతమ్‌ ఇష్టానికే బిగ్ బాస్ వదిలేశారు. దీంతో ఆ షీల్డుని హరితేజకు ఇచ్చాడు గౌతమ్. అయితే ఆ షీల్డ్ ఉన్న హరితేజని కనుక నామినేట్ చేస్తే మాత్రం ప్రైజ్ మనీ నుంచి రూ. 50 వేలు తగ్గిపోతాయని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు క్లారిటీ ఇచ్చాడు. ఇక విష్ణు ప్రియ మొదట ప్రేరణని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణ వ్యవహరించే తీరు బాగాలేదని చెబుతూ నామినేట్ చేయగా.. విష్ణు ప్రియ వాదనకు ప్రేరణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత నిఖిల్‌ని విష్ణు ప్రియ నామినేట్ చేసింది. సిగరెట్‌కి పాయింట్స్ ఇవ్వడం లేదని నిఖిల్‌ని నామినేట్ చేసినట్లుగా విష్ణు ప్రియ తెలపగా.. నిఖిల్ కూడా తగ్గకుండా.. నువ్వు టిఫిన్ కోసం పాయింట్స్ ఇవ్వలేదా? అంటూ కౌంటరిచ్చాడు. ఈ రెండు సందర్భాల్లోనూ విష్ణు ప్రియ తెల్లముఖం వేసింది. కాసేపు నిఖిల్, విష్ణు ప్రియల మధ్య నడిచిన వితండవాదన ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. మరీ ముఖ్యంగా విష్ణు ప్రియ ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్లిందనేది ఆమెకు కూడా క్లారిటీ లేదనే విషయం అయితే ఆమె ప్రవర్తన తెలియజేసింది.


ఇక రోహిణి, నిఖిల్ మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగింది. నిఖిల్‌ పనులు చేయడం లేదని చెబుతూ రోహిణి నామినేట్ చేసింది. దానికి నిఖిల్ కామెడీ చేయాలా? అంటూ రోహిణిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ.. యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అంతేకాదు, ఆమెను చాలా చీప్‌గా చూడటంతో.. రోహిణి కూడా తన నోటికి పని చెప్పింది. ఏంటి అలా చూస్తున్నావ్.. బాడీ షేమింగా? అంటూ నిఖిల్‌పై ఫైర్ అయింది. ‘తొక్కలో నామినేషన్’ అంటూ ఇద్దరూ రచ్చ రచ్చ చేశారు. నయని వచ్చేసి మెహబూబ్‌ని, నిఖిల్‌ని నామినేట్ చేసింది. అయితే ఆమె నామినేట్ చేయడానికి గల కారణాలను వాళ్లు తిప్పి కొట్టడంతో ఒక్కసారిగా నయని ముఖం మాడిపోయింది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య కూడా మాటల యుద్ధం బాగానే నడిచింది. ప్రేరణని హరితేజ నామినేట్ చేసింది. నామినేట్ చేయడానికి హరితేజ చెప్పిన కారణాలపై ప్రేరణ కూడా తగ్గలేదు. మెహబూబ్ కూడా హరితేజ‌కు స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చాడు. ఇక నబిల్, ప్రేరణల మధ్య జరిగిన నామినేషన్ వార్.. వెగటు పుట్టించింది. వారిద్దరూ వెక్కిరించుకుంటూ.. చిన్న పిల్లల కంటే అన్యాయంగా బిహేవ్ చేశారు. ఆ తర్వాత నబిల్, హరితేజల మధ్య కాసేపు వాదన నడిచింది. ఇంకా నామినేషన్ ప్రాసెస్ పూర్తవలేదు కాబట్టి.. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారి లిస్ట్ మంగళవారం వచ్చే ఎపిసోడ్‌తో తెలియనుంది.

Also Read- Ananya Krishnan:సత్య కృష్ణన్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2024 | 10:48 AM