మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sanjana Anne: మెగా ఫోన్.. పట్టుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ

ABN, Publish Date - Feb 19 , 2024 | 09:16 PM

తెలుగులో ఈ మధ్య కొందరు లేడీ డైరెక్టర్స్ త‌మ‌ సత్తా చూపించి విజయాలు అందుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్‌ సంజన అన్నే త్వ‌ర‌లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతోంది.

sanjana

అప్పుడెప్పుడో భానుమతి, ఆ తర్వాత సావిత్రి, విజయ నిర్మల ఆపై బి జయ, ఇప్పుడు నందినీ రెడ్డి,సుధ కొంగ‌ర వంటి వాళ్లు ఇలా తరానికి ఒక్కరిద్ద‌రు లేడీ డైరెక్టర్స్ వ‌స్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తూ మెగా ఫోన్ పట్టి తమ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చూపిస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించి విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేశారు. ఆకాశ‌మే హ‌ద్దురా వంటి సినిమాతో మ‌న తెలుగమ్మాయి సుధా కొంగ‌ర దేవ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.


తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన, తెలుగు బిగ్‌బాస్‌2 కంటెస్టెంట్ సంజన అన్నే(Sanjana Anne) కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతోంది. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే (Sanjana Anne) నిర్శ‌హిస్తోంది.

Updated Date - Feb 19 , 2024 | 09:16 PM