Bigg Boss 8 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.. లీకులే లీకులు
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:17 PM
బిగ్ బాస్ తెలుగు షో పన్నెండో వారం ముగిసే సమయానికి చేరుకుంది. ఈ ఆదివారం షాకింగ్ ఎలిమినేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో తప్పకుండా ఉంటుందని భావించిన కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా అప్పుడే లీకుల ద్వారా మ్యాటర్ బయటికి వచ్చేసింది. ఆ కంటెస్టెంట్ ఎవరంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పన్నెండో వారం ముగిసేందుకు వచ్చేసింది. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మొదటి నుండి టాప్ 5లో ఉంటుందనే కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా లీక్స్ చెప్పేస్తున్నాయి. పన్నెండో వారంలో ఎలిమినేషన్ లిస్ట్‌లో ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, నబీల్, యష్మీలు ఉన్నారు. వీరిలో నుండి ఒకరు ఈ వారం బయటికి వచ్చేస్తున్నారు. ఆ ఒక్కరూ ఎవరో ఆల్రెడీ లీకుల ద్వారా బయటికి వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ అవుతుంది ఎవరో కాదు.. యష్మీ గౌడ.
Also Read-Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..
వాస్తవానికి మొదటి నుండి యష్మీ గౌడ చాలా యాక్టివ్‌గా ఉంటూ.. టాప్ 5లో ఉండటం పక్కా అనేలా.. షో చూస్తున్న ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. కానీ సడెన్‌గా ఆమెనే ఎలిమినేట్ అవడంతో.. అక్కడ ఎవరూ శాశ్వతం కాదని, ఏదైనా జరగవచ్చనే హింట్‌ని బిగ్ బాస్ ఇచ్చినట్లయింది. ఇక యష్మీ ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈ వారం ఓటింగ్ ఆమెను ఇంటి నుండి బయటికి పంపించినట్లుగా తెలుస్తోంది. ప్రేరణ, నబీల్, నిఖిల్ వరసగా మొదటి మూడు స్థానాల్లో ఓటింగ్ సంపాదించుకుని సేఫ్ కాగా, పృథ్వీ, యష్మీల మధ్య భారీ ఫైట్ జరిగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరిలో యష్మీకి ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో.. బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యేది యష్మీనే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చేశాయి.
ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఈ వారం అంతా జరిగిన టాస్క్‌లపై ఒక్కో కంటెస్టెంట్ చేసిన తప్పులను చెబుతూ.. వారికి క్లాస్ ఇచ్చారు నాగ్. యష్మీ సంచాలక్‌గా ఫెయిల్ అయిందంటూ విష్ణు, నిఖిల్ వెల్లడించారు. నిఖిల్‌ను మోటివేట్ చేసే ప్రక్రియను గౌతమ్ తీసుకున్నాడు. యష్మీ, నిఖిల్‌ల మధ్య ఉన్న బంధాన్ని చూసి తేజ షాక్ అవడమే కాకుండా.. వారిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో? అనేలా రోహిణితో డిస్కషన్ పెట్టాడు. ఇక నాగ్ పొగడ్తలతో రోహిణి ఉబ్బితబ్బిబ్బయింది. విష్ణు, రోహిణిలకు చిన్న క్లాస్ ఇచ్చిన అనంతరం వారిద్దరి మధ్య ఉన్న అంతరాయానికి నాగ్ బ్రేక్ వేశారు. నాగ్ మాట్లాడుతుంటే గౌతమ్ కలగజేసుకోవడం నచ్చని నాగ్.. అతనికి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. పృథ్వీ.. మీద మీదకు వెళ్లడంపై కూడా నాగ్ సీరియస్ అయ్యారు. ఇలా అందరికీ క్లాస్‌లు ఇచ్చిన అనంతరం కంటెస్టెంట్స్ మధ్య స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఆడించారు. ఈ వారం నిఖిల్ సేఫ్ అయినట్లుగా నాగ్ తెలిపారు. ఇక ఆదివారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి.