Bigg Boss 8 Telugu: నాగార్జున ధృతరాష్ట్రుడా? ఇలా అయిపోయాడేంటి?
ABN, Publish Date - Oct 22 , 2024 | 02:22 PM
ఇంతకు ముందు సీజన్స్‌లో హోస్ట్‌గా నాగార్జున కొంతైనా గేమ్ చూసి ఉండే వారెమో కానీ.. అందుకు కారణం కాస్త పేరున్న కంటెస్టెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ, ఈసారి మాత్రం ఆయనకున్న పర్సనల్ టెన్షన్స్ వల్లనో లేక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేరనో తెలియదు కానీ.. పూర్తిగా ధృతరాష్ట్రుడిలా, నిర్వాహకులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి హోస్టింగ్ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఎప్పుడూ లేనిది.. ఈసారి కింగ్ నాగార్జున (King Nagarjuna) బిగ్ బాస్ హోస్టింగ్ (Bigg Boss Host)పై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ స్టేజ్‌పై నాగార్జున గేమ్ చూసి హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది.. గేమ్ చూడకుండా, కేవలం బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇన్ పుట్ తీసుకుని హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈసారి సీజన్‌లో క్లారిటీగా తెలుస్తుందని ఆడియెన్స్ కొందరు డైరెక్ట్‌గానే కామెంట్ చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున హోస్టింగ్‌కు వచ్చినపుడు, చాలా సార్లు గేమ్‌లో హౌస్ మేట్స్ ఏది చెబితే అది విని తలాడించటం తప్ప.. వారి తప్పుల్లో ఒక్కదానికి కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఇది ఈ సీజన్‌కి మెయిన్ డ్రా బ్యాక్‌గా మారింది.
Also Read-Bigg Boss 8 Telugu: ‘తొక్కలో నామినేషన్’.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు
ఒకవేళ తను కనుక గేమ్ చూస్తుంటే మాత్రం.. నాగార్జున (Nagarjuna) ఖచ్చితంగా కంటెస్టెంట్స్ తీరును ఖండించేవారనే అభిప్రాయాలు నెటిజెన్స్ నుంచి కామెంట్స్ రూపంలో కనిపిస్తున్నాయి. అంటే ఈసారి సీజన్‌పై నాగార్జున కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టడం లేదనేలా వినిపిస్తోన్న టాక్.. ముందు మందు ఈ షో పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ షో పై అంతా నిరాశగా ఉన్నారు. సరైన కంటెంట్ లేదని, కంటెస్టెంట్స్ లేరనీ.. ఉన్న మంచి కంటెస్టెంట్స్‌ని చిన్న చిన్న కారణాలతో బయటకు పంపించేయడం ఏంటి? అంటూ ప్రేక్షకుల నుండి సైతం అసహనం వ్యక్తమవుతోంది. (Bigg Boss Telugu Season 8)
Also Read- Bigg Boss 8 Fame Sonia Akula: వాళ్లు ఎలిమినేట్ చేస్తే నేను రాలేదు.. ఎంతకైనా తెగిస్తాననే పంపారు
ఇక ఇంతకు ముందు సీజన్స్‌లో హోస్ట్‌గా నాగార్జున కొంతైనా గేమ్ చూసి ఉండే వారెమో కానీ.. అందుకు కారణం కాస్త పేరున్న కంటెస్టెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ, ఈసారి మాత్రం ఆయనకున్న పర్సనల్ టెన్షన్స్ వల్లనో లేక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లేరనో తెలియదు కానీ.. పూర్తిగా ధృతరాష్ట్రుడిలా, నిర్వాహకులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి హోస్టింగ్ చేశారనే ఆరోపణలు ఎలిమినేట్ అయిన వారి నుంచే కాక, షో ను చూసే కాస్తో కూస్తో వ్యూవర్స్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పబ్లిక్ ఒపీనియన్స్‌ను పట్టించుకోకుండా, కేవలం బిగ్ బాస్ టీంమ్ వైపు నుంచి వన్ సైడెడ్‌గా కొనసాగుతున్న సీజన్ 8కు టీఆర్పీలు రాకున్నా వస్తున్నాయంటూ ప్రమోట్ చేసుకోవటం మరీ విడ్డూరం అనే చెప్పుకోవాలి.