Pawan Kalyan: మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు

ABN, Publish Date - Sep 30 , 2024 | 02:17 PM

సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిథున్‌కు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన చేశారు. ఇందులో..

Mithun Chakraborty and Pawan Kalyan

సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌గా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dada Saheb Phalke) అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని వరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది. అక్టోబర్ 8న జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన మిథున్ చక్రవర్తికి ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (AP Deputy CM and Power Star Pawan Kalyan).. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారానికి ఎంపికైన మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో

Also Read- NBK: మిథున్ చక్రవర్తికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. బాలయ్య ఏమన్నారంటే..


‘‘ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తిగారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించింది. మిథున్ చక్రవర్తిగారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉంది. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...’ అనే పాటను ఎవరూ మరచిపోలేరు.


హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి గారు. నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తి గారికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను..’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.

Also Read- Pawan Kalyan: ఆ ఆడియో రికార్డు రూపొందించిన కీరవాణికి ధన్యవాదాలు

Also Read- Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2024 | 02:17 PM