Allu Arjun: నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి‌పై చర్యలకు ఈసీ ఆదేశం

ABN , Publish Date - May 12 , 2024 | 04:37 PM

శనివారం అల్లు అర్జున్ నంద్యాల పర్యటన నేపధ్యంలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇదే విషయమై నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది.

Allu Arjun: నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి‌పై చర్యలకు ఈసీ ఆదేశం
Allu Arjun Nandyal Tour

శనివారం అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల (Nandyal) పర్యటన నేపధ్యంలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇదే విషయమై నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ (EC) ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ఓపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ (DGP)కి ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు విషయం ఏమిటంటే..

నంద్యాలలో శనివారం సినీ నటుడు అల్లు అర్జున్ చేసిన పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లుఅర్జున్ వచ్చారు. అయితే వైకాపా శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


Bunny.jpg

ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం సీరియస్ అవడమే కాకుండా.. 60 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని, అలాగే తమ అనుమతి లేకుండా కేసు కొట్టి వేయొద్దని పోలీసు ఉన్నతాధికారులకు తేల్చి చెప్పింది.

Election.jpg

Updated Date - May 12 , 2024 | 05:00 PM