నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్‌లకు.. రచయిత పురాణపండకు ఋణపడ్డాను: ఆకొండి అంజి

ABN, Publish Date - Jul 25 , 2024 | 08:46 PM

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తెలుగు పూజా పీఠాలకు అందించిన ఎన్నో వైభవ గ్రంధాల్లో మరొక అపురూపమే ఈ ‘శ్రీమాలిక’ గ్రంధం అన్నారు కోనసీమకు చెందిన విఖ్యాత చిత్రకారుడు, శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఆకొండి అంజి. ఈ మంగళ గ్రంధాన్ని మరొకసారి ప్రచురించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి. విశ్వప్రసాద్, కూచిభొట్ల వివేక్‌లకు.. అలాగే రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, ప్రముఖ ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఒక విజిటింగ్ కార్డు ఇచ్చే ముందు కూడా ఎదుటి వ్యక్తి మనకు ఉపయోగపడతాడా.. లేదా.. అని ఆలోచించి మరీ అడుగు వేస్తున్న ఈరోజుల్లో సుమారు మూడు వందల పేజీల ‘శ్రీమాలిక’ అనే అద్భుత గ్రంధాన్ని అస్సలు వ్యాపార స్వార్ధాలు లేకుండా, మానవ అనుబంధ స్వార్ధాలు లేకుండా అందిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ సంస్థకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదన్నారు కోనసీమకు చెందిన విఖ్యాత చిత్రకారుడు, శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఆకొండి అంజి.

గోదావరీతీరం రాజమహేంద్రవరం కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారికి ఆధ్యాత్మిక ఉపన్యాస వైభవాల్లో, రచనల్లో, సంకలనాల్లో ఆరితేరిన పురాణపండ వారి వంశంలో ఇప్పుడు స్వచ్ఛ హృదయమున్న ప్రముఖ రచయితగా, స్వార్ధాన్ని విసిరికొట్టే నిర్మొహమాటమున్న మంచి వక్తగా, గిరి గీసుకుని తమ చుట్టూ తామే తిరిగే సొంత డబ్బారాయుళ్లకు దూరంగా, స్వార్ధం ముసుగులో ఉంటే బంధువైనా దూరంగా పెట్టేసే నిష్కపటమైన వ్యక్తిగా, జీవితంలో చిన్నతనం నుంచీ కష్టాలకు ఎదురీదుతూ అసాధారణ ప్రతిభావంతునిగా, వేల పాఠకుల హృదయాల్ని కొల్లగొట్టిన ప్రముఖ రచయితగా పేరుపొందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తెలుగు పూజా పీఠాలకు అందించిన ఎన్నో వైభవ గ్రంధాల్లో మరొక అపురూపమే ఈ ‘శ్రీమాలిక’ గ్రంధం.


తొలుత కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ఇంటిలో ఒక శుభ కార్యానికి ప్రచురితమైన ఈ గ్రంధం సుమారు రెండువేల మందికి ఉచితంగా చేరింది. ఆ తర్వాత ‘ఈగ’ చలనచిత్రం నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ ‘శ్రీమాలిక’ను ప్రచురించి యాదాద్రి శ్రీ నరసింహ స్వామి సమక్షంలో అక్కడి ఆలయ అధికార, అర్చక గణాలకు, భక్త బృందాలకు బహూకరించారు.

అనంతరం హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి కుమారుడు హర్షవర్ధన్ వారం రోజులపాటు భక్తగణాలకు ఈ ‘శ్రీమాలిక’ను తమ సంస్థ పేర్లతో ఉచితంగా సమర్పించి వందలమంది చేత అభినందనలు పొందడం విశేషం.

అలా ప్రముఖులెందరో ప్రచురించిన ఈ మంగళ గ్రంధాన్ని మరొకసారి ప్రచురించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి. విశ్వప్రసాద్, కూచిభొట్ల వివేక్‌లకు ఆకొండి అంజి ధన్యవాదాలపై ధన్యవాదాలు తెలపడం ప్రత్యేకమే మరి.

‘‘గత సంవత్సరం కార్తీక మాసంలో ఆరామద్రావిడ బ్రాహ్మణుల సమావేశానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ కార్తీక వనభోజనాలకు విచ్చేసిన సుమారు వెయ్యి కుటుంబాలకు కూచిభొట్ల వివేక్‌గారి అనుచరులు ఈ గ్రంధాన్ని ఉచితంగా ఇవ్వడం చూసి.. ఈ బుక్‌లో వున్నా కంటెంట్ చాలా చాలా బాగుండటంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌గారికి మెయిల్ చేసి కొన్ని బుక్స్ మాత్రం కోరడంతో.. ఆయన రిప్లై ఇస్తూ... ఈ బుక్ క్రెడిట్ నాది కాదు.. విశ్వప్రసాద్‌గారు, కూచిభొట్ల వివేక్‌గారు ఈ గ్రంధానికి సౌజన్యం అందించారు. ఈ కృతజ్ఞతలు వారికి చెప్పండి.. అది ధర్మం కూడా అన్నారు. అదీ శ్రీనివాస్ గారి విజ్ఞతకు నిదర్శనం’’ అని అన్నారు ఆకొండి అంజి.

అక్కడి నుండీ.. అమలాపురంలో జరిగిన దైవ, సాంస్కృతిక, చిత్ర కళల ఫంక్షన్స్‌లో, హైదరాబాద్‌లో వారం రోజుల పాటు మా సంస్థ సాలార్ జంగ్ మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల చిత్ర కళాకారులైన ప్రముఖులకు ఈ శ్రీమాలిక పంచుతుంటే వచ్చిన స్పందనకు ఆశ్చర్యపోయాను. ఎంతమంది తల్లులు, అతిరథమహారధులు ఆనందించారోనని అంజి చెప్పారు. ఇటీవల సంస్కారభారతి, విజయవాడ వేడుకల్లో సైతం కూచిభొట్ల వివేక్‌గారు నిస్వార్ధంగా మనకి ఈ బుక్స్ ఇచ్చారనగానే వాళ్ళు నాపై చూపిన అభిమానం, పురాణపండ శ్రీనివాస్‌గారికి, వివేక్‌గారికీ కృతజ్ఞతలు సభాముఖంగా చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు అంజి.

ఏక మొత్తంగా సారాంశమేమంటే తెలుగు చలన చిత్ర రంగంలో ఇలా ధార్మిక కార్యక్రమాలు చేసే వారి సంఖ్యలో విశ్వప్రసాద్, వివేక్ వంటి ప్రముఖుల గ్రంథ సేవ తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగడం అభినందనీయం. శ్రీమాలిక దివ్య గ్రంధంపై ఇప్పటికే తిరుమల, యాదాద్రి, అన్నవరం, ఇంద్రకీలాద్రి వంటి మహాక్షేత్రాల ప్రధాన అర్చకుల ప్రశంసలు వర్షించడం ఆ గ్రంధ ప్రత్యేకతను తెలుపుతోందనడం నిర్వివాదాంశం.


జీవనపోరాటంలో ఎన్నో ఆటుపోట్లేదుర్కొన్నా.. తాను నష్టపోయినా, తనను నష్ట పరిచినా పదిమందికీ అన్నం పెట్టేలా మాత్రమే దైవీయ అంశాలతో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌కి దైవబలం, విరామమెరుగక పరిశ్రమించే నిజాయితీతో కష్టపడే తత్వం ఉండటం వల్లనే ఈ అసాధారణ ప్రతిభావంతుని గ్రంథ వైభవం దేశాల ఎల్లలు దాటి పవిత్రంగా ఢంకా భజాయించిందని విఖ్యాత ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఇటీవల బెజవాడ దుర్గమ్మ సన్నిధానంలో శ్రీనివాస్ బుక్ ఆవిష్కరిస్తూ అన్నారంటే.. పురాణపండ శ్రీనివాస్‌పై మహా సరస్వతీ కటాక్షం ఎంత పుష్కలంగా ఉందో కదా అని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన పండితులననడం అమ్మవారి కటాక్షం కాక మరేమిటి?!

ఇటీవల నాలుగైదు కళాత్మక కార్యక్రమాలలో ఈ బుక్‌ని సమర్పించిన ఆకొండి అంజిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందేనంటున్నారు రసజ్ఞులు. శ్రీ లక్ష్మీ గణపతి ముఖ చిత్రంతో, శ్రీ దేవి భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుని ముఖ చిత్రంతో, పరమ శివుని గంభీర ముద్రతో.. ఇలా మూడు నాలుగు రకాల ముఖ చిత్ర సౌందర్యాలతో ఆబాల గోపాలాన్నీ అలరిస్తున్న ఈ శ్రీమాలికను మొట్ట మొదట కాంచీపుర యతీంద్రులు, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి ఆవిష్కరించడం శ్రీనివాస్ కృషికి అమ్మవారి ఆశీర్వచనమంటున్నారు విజ్ఞులు.

Updated Date - Jul 26 , 2024 | 12:06 AM